ఫోన్‌ఇన్‌ కార్యక్రమానికి 20 వినతులు

ABN , First Publish Date - 2020-08-04T10:54:36+05:30 IST

ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరిం చాలని కలెక్టర్‌ శరత్‌ రెవెన్యూ డివిజినల్‌

ఫోన్‌ఇన్‌ కార్యక్రమానికి 20 వినతులు

సత్వరమే పరిష్కారించాలని 

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం


కామారెడ్డిటౌన్‌, ఆగస్టు 3: ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరిం చాలని కలెక్టర్‌ శరత్‌ రెవెన్యూ డివిజినల్‌ అధికారులను, జిల్లా అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ నేప థ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్య క్రమానికి ప్రత్యామ్నాయంగా కలెక్టర్‌ తన చాంబర్‌లో స్వయంగా ప్రజల నుంచి ఫోన్‌ఇన్‌ కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో భాగంగా 20 ఫిర్యా దులు వచ్చాయి. ఫోన్‌ఇన్‌ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫి ర్యాదులను సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసు కొని పరిష్కరించాలని ఆదేశించారు. భూ సమస్యలను స్థా నిక తహసీల్దార్లల పరిష్కరించనున్నట్లు తెలిపారు.


కామారెడ్డి మున్సిపాలిటీలో అటెండర్‌గా పనిచేసే నర్సింలు అనే వ్యక్తి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉన్నారనే ఫిర్యాదుపై పరిశీలించాలని కామారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌కు ఆదేశించారు. బిచ్కుంద మండలం గుండె కల్లుర్‌ గ్రామం ఎస్‌సీ కాలనీ దగ్గరగా కడుతున్న శ్మశానవాటికను దూరం లో కట్టాలనే ఫిర్యాదుపై జిల్లా పంచాయతీ అధికారిని క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిట్లం మండలం కారెగావ్‌ గ్రామం నుంచి రాజు ఎంపీటీసీ చెరువులోనికి నీరు వెళుతున్న వైపే వై కుంఠధామం నిర్మాణం చేస్తున్నారనే ఫిర్యాదుపై సంబంఽ దిత తహసీల్దార్‌తో పరిశీలించనున్నట్లు తెలిపారు.


కామారెడ్డి పట్టణం సుభాష్‌రోడ్డులో వాసవి ఇడ్లి సెంట ర్‌లో కరో నా నేపథ్యంలో వ్యక్తిగత దూరం పాటించడం లేదని, పరి శుభ్రత లేదనే ఫిర్యాదుపై తహసీల్దార్‌, మున్సిపల్‌ కమిన ర్‌లు తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్య క్రమంలో జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-04T10:54:36+05:30 IST