బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

ABN , First Publish Date - 2021-03-11T15:09:33+05:30 IST

ఏడేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు..

బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

హైదరాబాద్/చాంద్రాయణగుట్ట : ఏడేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విఽధిస్తూ తీర్పునిచ్చింది. జంగమ్మెట్‌ ఖాద్రీచమన్‌ ప్రాంతానికి చెందిన ఎన్‌.మతీన్‌ అలీఖాన్‌ అలియాస్‌ మతీన్‌ అలీఖాన్‌ పఠాన్‌ (47) డ్రైవర్‌. 2019 జనవరి 20న ఇంటి సమీపంలో ఉండే  ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఛత్రినాక పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు నిందితుడు మతీన్‌ అలీఖాన్‌కు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించినట్లు ఛత్రినాక పోలీసులు తెలిపారు.


Updated Date - 2021-03-11T15:09:33+05:30 IST