20 ఏళ్ల యువతి.. సిటీలో అద్దె గదిలో ఉంటూ నర్సింగ్.. రెంట్ అడుగుదామని రాత్రి పూట ఆమె గది వద్దకు వెళ్తే..

ABN , First Publish Date - 2021-10-06T20:48:30+05:30 IST

ఆమెకు సుమారుగా 20ఏళ్లు ఉంటాయి. తల్లిదండ్రులకు దూరంగా సిటీలో గదిని అద్దెకు తీసుకుని ఉంటూ.. గవర్నమెంట్ కాలేజీలో నర్సింగ్ చేస్తోంది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆమె కాలేజీకి వెళ్లి, రూంకు తిరిగొచ్చింది. ఈ క్రమంలో రాత్రిపూట ఆ ఇంటి ఓనర్ ఆమె గది తలుపు తట్టారు. ఎంత

20 ఏళ్ల యువతి.. సిటీలో అద్దె గదిలో ఉంటూ నర్సింగ్.. రెంట్ అడుగుదామని రాత్రి పూట ఆమె గది వద్దకు వెళ్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు సుమారుగా 20ఏళ్లు ఉంటాయి. తల్లిదండ్రులకు దూరంగా సిటీలో గదిని అద్దెకు తీసుకుని ఉంటూ.. గవర్నమెంట్ కాలేజీలో నర్సింగ్ చేస్తోంది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆమె కాలేజీకి వెళ్లి, రూంకు తిరిగొచ్చింది. ఈ క్రమంలో రాత్రిపూట ఆ ఇంటి ఓనర్ ఆమె గది తలుపు తట్టారు. ఎంతకీ ఆమె డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఆ యజమాని కంగారు పడ్డారు. ఈ నేపథ్యంలోనే తలుపులు బద్దలు కొట్టారు. అనంతరం ఆ రూంలో కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. 



రాజస్థాన్‌కు చెందిన ప్రియాంక కత్వా అనే 20ఏళ్ల యువతి చురు పట్టణంలోని గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు గ్రామంలో ఉండగా.. ప్రియాంక మాత్రం చురులోనే ఓ అద్దె గదిలో ఉంటోంది. ఎప్పటిలాగే శనివారం కూడా కాలేజీకి వెళ్లిన ప్రియాంక.. సాయంత్రానికి ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో ప్రియాంక తన గదిలోనే ఉన్నట్లు గుర్తించిన ఆ ఇంటి ఓనర్.. అద్దె డబ్బులు అడిగేందుకని రాత్రి సమయంలో ఆమె గది తలుపు తట్టారు. అయితే ప్రియాంక ఎంతకూ తలుపులు తీయకపోవడంతో ఆ యజమాని ఆందోళనకు గురయ్యారు. అనంతరం తలుపులు బద్దలు కొట్టి.. గదిలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో అక్కడ కనిపించిన దృశ్యం చేసి ఆ ఓనర్ ఒక్కసారిగా షాకయ్యారు. 



ప్రియాంక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడాన్ని గుర్తించి.. విస్తుపోయారు. షాక్ నుంచి తేరుకున్న అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా ప్రియాంక గదిలో పోలీసులు ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో.. సూసైడ్ చేసుకుంటున్నందుకు గానూ ప్రియాంక తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పిందని.. స్వార్థపూరితమైన ప్రపంచంలో ఉండలేకే ప్రాణాలు తీసుకుంటున్నట్లు వెల్లడించిందని పోలీసులు చెప్పారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రియాంక ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలపై ఆరా తీసుస్తున్నారు. ఇదిలా ఉంటే.. బీఎస్సీ నర్సింగ్ కోర్సు రెండో సంవత్సరంలో ప్రియాంక మొదటి డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించినట్లు పోలీసులు గుర్తించారు. 


Updated Date - 2021-10-06T20:48:30+05:30 IST