200 మంది బీజేపీ కార్యకర్తల్ని చంపారు: కేంద్రమంత్రి

ABN , First Publish Date - 2021-12-20T17:34:57+05:30 IST

కేరళలో అసలు శాంతిభద్రతల నిర్వహణ అనేదే లేదు. భారతీయ జనతా పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇక్కడ రక్షణే లేదు. గడిచిన కొద్ది సంవత్సరాల్లో 200 మందికి పైగా బీజేపీ కార్యకర్తల్ని హత్య చేశారు. అయినా ఇక్కడి ప్రభుత్వం ఈ హత్యలపై కనీస దర్యాప్తుకు వెళ్లలేదు..

200 మంది బీజేపీ కార్యకర్తల్ని చంపారు: కేంద్రమంత్రి

తిరువనంతపురం: గడిచిన కొద్ది సంవత్సరాల్లో కేరళ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని, ఈ సంఖ్య సుమారుగా 200పైగానే ఉంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు. సోమవారం కేరళలోని అలపుజాలో నిర్వహించిన ఓబీసీ మోర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేరళలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై నిత్యానంద్ తీవ్ర విమర్శలు గుప్పించారు.


‘‘కేరళలో అసలు శాంతిభద్రతల నిర్వహణ అనేదే లేదు. భారతీయ జనతా పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇక్కడ రక్షణే లేదు. గడిచిన కొద్ది సంవత్సరాల్లో 200 మందికి పైగా బీజేపీ కార్యకర్తల్ని హత్య చేశారు. అయినా ఇక్కడి ప్రభుత్వం ఈ హత్యలపై కనీస దర్యాప్తుకు వెళ్లలేదు. పినరయి ప్రభుత్వం హత్యారాజకీయాలు చేస్తోంది. పక్షపాత రాజకీయాలకు ఎల్‌డీఎఫ్ కేరాఫ్ అడ్రస్. బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న హత్యలపై విచారణ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నేరస్తులను గుర్తించి శిక్షించాలని విజయన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అని నిత్యానంద్ రాయ్ అన్నారు.

Updated Date - 2021-12-20T17:34:57+05:30 IST