200 బస్తాల రేషన్‌ బియ్యం సీజ్‌

ABN , First Publish Date - 2021-06-14T05:51:59+05:30 IST

రేషన్‌ బియ్యాన్ని అ క్రమంగా లారీలో తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి, 200 బస్తాలు సీజ్‌ చేసినట్లు వేటపాలెం ఎస్సై కమలాకర్‌ తెలిపారు. శనివారం అర్థరాత్రి దాటిన తరువాత విధి నిర్వహణలో ఉన్న వేటపాలెం పోలీసులు దేశాయిపేట జంక్షన్‌ వద్ద అనుమానంతో ఓ లారీని ఆపి తనిఖీ చేశా రు. అందులో 200 బస్తాలు రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.

200 బస్తాల రేషన్‌ బియ్యం సీజ్‌
వేటపాలెం పోలీస్‌స్టేషన్‌ వద్ద రేషన్‌ బియ్యం లారీ

తిమ్మసముద్రంకు చెందిన వ్యక్తికి చెందినవిగా గుర్తింపు


వేటపాలెం(చీరాల), జూన్‌ 13 : రేషన్‌ బియ్యాన్ని అ క్రమంగా లారీలో తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి, 200 బస్తాలు సీజ్‌ చేసినట్లు వేటపాలెం ఎస్సై కమలాకర్‌ తెలిపారు. శనివారం అర్థరాత్రి దాటిన తరువాత విధి నిర్వహణలో ఉన్న వేటపాలెం పోలీసులు దేశాయిపేట జంక్షన్‌ వద్ద అనుమానంతో ఓ లారీని ఆపి తనిఖీ చేశా రు. అందులో 200 బస్తాలు రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను విచారించగా ఆ రేషన్‌ బియ్యం నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన ఒ క వ్యక్తివని చెప్పాడు. అందుకు సంబంధించి పూర్తివివరాలు విచారణలో తెలియాల్సి ఉంది. పట్టుబడ్డ లారీని వేటపాలెం పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.


Updated Date - 2021-06-14T05:51:59+05:30 IST