ఢిల్లీ అల్లర్ల ఘటన: ఐదుగురికి హైకోర్టు బెయిల్

ABN , First Publish Date - 2021-09-03T23:42:25+05:30 IST

సంచలనం సృష్టించిన 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో ఐదుగురు నిందితులకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారంనాడు

ఢిల్లీ అల్లర్ల ఘటన: ఐదుగురికి హైకోర్టు బెయిల్

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో ఐదుగురు నిందితులకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో చోటుచేసుకున్న అల్లర్లలో ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రతన్‌లాల్ హత్యతో పాటు, డీసీపీ గాయపడ్డారు. ఈ కేసులోనే ఐదుగురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు ఇస్తూ, అభియోగాలపై విచారణ పేరుతో నిందితులు చాలాకాలం పాటు జైళ్లలో మగ్గరాదని అన్నారు.


2020 అల్లర్ల కేసులో ఢిల్లీ పోలీసుల విచారణపై ఢిల్లీ కోర్టు గురువారంనాడు అక్షింతలు వేసింది. సరైన దర్యాప్తు సాగించడంలో పోలీసుల వైఫల్యాన్ని తప్పుపట్టింది. కాగా, చాద్‌బాగ్ ఏరియాలో దుకాణాల లూటీ, విధ్వంసానికి సంబంధించిన ఆరోపణల నుంచి ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ సోదరుడు షా అలాం, మరో ఇద్దరికి కోర్టు ఇటీవల విముక్తి కలిగించింది. ఘటనా స్థలిలో నిందితుడు ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్‌ కానీ, తనంత తాను సాక్ష్యం చెప్పేందుకుగా ముందుకు వచ్చిన వ్యక్తిని కానీ పోలీసులు చూపించలేకపోయారని, క్రిమినల్ కుట్ర జరిగిందనడానికి మెటీరియల్ ఎవిడెన్స్ కూడా చూపించలేదని అడిషనల్ సెషన్స్ జడ్జి వినోద్ యాదవ్ పేర్కొన్నారు.

Updated Date - 2021-09-03T23:42:25+05:30 IST