నూజివీడులో 21 కేసులు

ABN , First Publish Date - 2020-07-14T09:55:56+05:30 IST

నూజివీడు నియోజకవర్గంలో ఆది, సోమవారాల్లో కలిపి మొత్తం 21 కరోనా కేసులు నమోదయ్యాయి.

నూజివీడులో 21 కేసులు

 9 హై డిటెక్టెడ్‌గా గుర్తింపు


నూజివీడు : నూజివీడు నియోజకవర్గంలో ఆది, సోమవారాల్లో కలిపి మొత్తం 21 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఆదివారం నూజివీడు పట్టణంలో గుర్తించబడిన తొమ్మిది కేసులు ‘హై’డిటెక్టెడ్‌ కేసులుగా వైద్య పరీక్షల్లో వెల్లడి అయ్యింది. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. సోమవారం నూజివీడు పట్టణంలో కొత్తపేటలో ఎనిమిది, రూరల్‌ గ్రామాలు అయిన ఆగిరిపల్లి, తుక్కులూరు, పల్లెర్లమూడి గ్రామాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి. నూజివీడు పట్టణంలో మొత్తం కేసుల సంఖ్య 105కు, రూరల్‌లో 14కు, ఇతర మండలాల్లో 20కు చేరుకున్నాయి.


మైలవరం మండలంలో ఒకరి మృతి

మైలవరం రూరల్‌ : మైలవరం మండలం తోలుకోడులో కరోనాతో ఒక వ్యక్తి మృతిచెందినట్టు అధికారులు నిర్ధారించారు. అనారోగ్యంతో మృతి చెందినవ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చినట్లు చంద్రాల పీహెచ్‌సీ వైద్యాధికారి నరేష్‌ తెలిపారు. దీంతో అతని అంత్యక్రియలకు హాజరైన 14 మందికి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.   

Updated Date - 2020-07-14T09:55:56+05:30 IST