Report: ప్రతి గంటకు 21 మంది నిరాశ్రయులవుతున్నారు

ABN , First Publish Date - 2021-09-11T21:59:29+05:30 IST

నిరాశ్రయులవుతున్న వారిలో ఎక్కువ భాగం స్లమ్‌లో నివసిస్తున్న వారే. కాగా, మొత్తంగా అత్యంత పేదవారే ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు హెచ్ఎల్ఆర్ఎన్ సర్వే తెలిపింది. స్లమ్ నిర్మూలన, పట్టణ సుందరీకరణ

Report: ప్రతి గంటకు 21 మంది నిరాశ్రయులవుతున్నారు

న్యూఢిల్లీ: కొవిడ్ కారణంగా దేశంలో లక్షల మంది నిరాశ్రాయులవుతున్నారు. మార్చి 2020 నుంచి జూలై 2021 మధ్య దేశవ్యాప్తంగా 2,50,000 మంది నిరాశ్రాయులయ్యారు. ఈ లెక్కన ప్రతి గంటలో 21 మంది నివాసం కోల్పోయి రోడ్డున పడుతున్నట్లు అనాలసిస్ బై ది హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్స్ నెట్‌వర్క్ (హెచ్ఎల్ఆర్ఎన్) సర్వే తెలిపింది.


కొవిడ్ కారణంగా ప్రజలందరినీ ఇళ్లు దాటవద్దని ఓవైపు చెప్తూన్న ప్రభుత్వమే మరోవైపు ఇంత మందిని నిరాశ్రాయలును చేయడం పట్ల అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ ఒక్క ఏడాదే 31 జూలై వరకు ప్రభుత్వ వర్గాలు అధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం.. 24,445 (1,69,176 ప్రజలు) కుటుంబాలు నివాసం కోల్పోయాయట. కొవిడ్ తీవ్రంగా ఉన్న ఏప్రిల్-మే సమయంలోనే 13,750 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.


నిరాశ్రయులవుతున్న వారిలో ఎక్కువ భాగం స్లమ్‌లో నివసిస్తున్న వారే. కాగా, మొత్తంగా అత్యంత పేదవారే ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు హెచ్ఎల్ఆర్ఎన్ సర్వే తెలిపింది. స్లమ్ నిర్మూలన, పట్టణ సుందరీకరణ, ఇతర అభివృద్ధి పనుల పేరిట అనేక మంది నిరాశ్రాయులవుతున్నారని, అయితే వారికి పరిహారం మాత్రం అందడం లేదని హెచ్ఎల్ఆర్ఎన్ పేర్కొంది.

Updated Date - 2021-09-11T21:59:29+05:30 IST