వారంలో 21 శాతం పెరిగిన కరోనా మరణాలు.. 8 శాతం పెరిగిన కొత్త కేసులు!

ABN , First Publish Date - 2021-07-29T15:22:30+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా గడచిన వారంలో కరోనా మృతుల

వారంలో 21 శాతం పెరిగిన కరోనా మరణాలు.. 8 శాతం పెరిగిన కొత్త కేసులు!

జనీవా: ప్రపంచవ్యాప్తంగా గడచిన వారంలో కరోనా మృతుల సంఖ్య 21 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. వీటిలో 69 వేల మరణాలు అమెరికా, దక్షిణ ఆసియాలో సంభవించాయని పేర్కొంది. ఇదేవిధంగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య 8 శాతం పెరిగిందని, ప్రపంచవ్యాప్తంగా సగటున 5 లక్షల, 40 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. కాగా దేశంలో కరోనా బారిన పడినవారి సంఖ్య 19.4 కోట్లకు చేరింది. 


ఇప్పటివరకూ కరోనా కారణంగా 41.93 లక్షల మంది మృతి చెందారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.41 కోట్ల యాక్టివ్ కేసులు ఉన్నాయి. పరిస్థితులు ఇదేవిధంగా కొనసాగితే రాబోయే రెండు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20 కోట్లను దాటుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతం అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా, బ్రిటన్, భారత్‌లలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్ కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Updated Date - 2021-07-29T15:22:30+05:30 IST