210 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-09-15T06:47:59+05:30 IST

జిల్లాలో సోమ, మంగళవారాల నడుమ అత్యధికంగా 210 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

210 కరోనా కేసులు

తిరుపతి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమ, మంగళవారాల నడుమ 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 210 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతకు మునుపు 24 గంటలతో పోలిస్తే కేసుల సంఖ్య వందకు పైగా పెరిగినప్పటికీ మరణాలు మాత్రం ఒక్కటి కూడా నమోదు కాకపోవడం ఊరట కలిగిస్తోంది. మంగళవారం ఉదయానికి జిల్లాలో ఇప్పటి వరకూ గుర్తించిన పాజిటివ్‌ కేసుల సంఖ్య 241006కు చేరగా మరణాల సంఖ్య 1876, యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు 2138 చొప్పున వున్నాయి. తాజా పాజిటివ్‌ కేసులు తిరుపతిలో 39, తిరుపతి రూరల్‌లో 22, చంద్రగిరిలో 17, పీలేరులో 14, చిత్తూరులో 10, పాకాలలో 9, రేణిగుంట, వాల్మీకిపురం మండలాల్లో 7 వంతున, వెదురుకుప్పం, కేవీబీపురం మండలాల్లో 6 చొప్పున, కుప్పం, రొంపిచెర్ల మండలాల్లో 5 వంతున, మదనపల్లె, పులిచెర్ల, గుడిపాల, వడమాలపేట మండలాల్లో 4 చొప్పున, పలమనేరు, ఏర్పేడు, ఎర్రావారిపాలెం, గుర్రంకొండ మండలాల్లో 3 వంతున, శ్రీకాళహస్తి, రామచంద్రాపురం, కురబలకోట, జీడీనెల్లూరు, కార్వేటినగరం, బి.కొత్తకోట, తంబళ్ళపల్లె, బీఎన్‌ కండ్రిగ, శాంతిపురం మండలాల్లో 2 చొప్పున, పుత్తూరు, సదుం, బంగారుపాలెం, కేవీపల్లె, పూతలపట్టు, తవణంపల్లె, సోమల, తొట్టంబేడు, శ్రీరంగరాజపురం, నిమ్మనపల్లె, ఐరాల, నారాయణవనం, చౌడేపల్లె, యాదమరి, వరదయ్యపాలెం, వి.కోట, ములకలచెరువు మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.

Updated Date - 2021-09-15T06:47:59+05:30 IST