21న తుంగభద్ర అంత్య పుష్కరాలు

ABN , First Publish Date - 2021-11-20T18:42:36+05:30 IST

పవిత్ర నది తుంగభద్ర అంత్య పుష్కరాలను ఈనెల 21న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని శ్రీరామనగర్‌కు చెందిన స్వామి వివేకానంద సేవా సంఘం అధ్యక్షుడు గారపాటి రామకృష్ణ శుక్రవారం ఆంధ్రజ్యోతికి

21న తుంగభద్ర అంత్య పుష్కరాలు

బెంగళూరు: పవిత్ర నది తుంగభద్ర అంత్య పుష్కరాలను ఈనెల 21న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని శ్రీరామనగర్‌కు చెందిన స్వామి వివేకానంద సేవా సంఘం అధ్యక్షుడు గారపాటి రామకృష్ణ శుక్రవారం ఆంధ్రజ్యోతికి చెప్పారు. గంగావతి - కంప్లి మార్గంలోని చిక్క జంతకల్‌ వద్ద ఈ వేడుకను కనుల పండువగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. కాగా పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఉదయం గోపూజ, తులసి, ఉసిరిచెట్టు పూజ, సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతాయన్నారు. తుంగభద్ర అంత్య పుష్కరాలల్లో భాగంగా గంగాపూజ, గీతా, హనుమాన్‌ చాలీసా పారాయణం భజన తదుపరి వనభోజనాలు ఉంటాయ్నారు. ఈ సంప్రదాయ బద్ధమైన వేడుకను ఎన్నో దశాబ్దాలుగా క్రమం తప్పకుండా నిర్వహించుకుంటూ వస్తున్నామని చెప్పారు. చిక్క జంతకల్‌ గంగమ్మ ఆలయం, హనుమాన్‌ ఘాట్‌ల వద్ద ఈ కార్యక్రమాలు ఉంటాయన్నారు. వీటిని విజయవంతం చేయాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-11-20T18:42:36+05:30 IST