22 ఏ జాబితా నుంచి బొల్లవరం ప్లాట్లు తొలగించండి

ABN , First Publish Date - 2021-12-04T04:47:54+05:30 IST

బొల్లవరం మున్పిపల్‌ లేఅవుట్‌ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి జిల్లా కలెకర్‌ విజ యరామరాజును కోరారు.

22 ఏ జాబితా నుంచి బొల్లవరం  ప్లాట్లు తొలగించండి
కలెక్టర్‌కు సమస్య విన్నవిస్తున్న ఎమ్మెల్యే

ప్రొద్దుటూరు అర్బన్‌ డిసెంబరు 3: బొల్లవరం మున్పిపల్‌ లేఅవుట్‌ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి జిల్లా కలెకర్‌ విజ యరామరాజును కోరారు. శుక్ర వారం తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌ కమిషనర్‌ వెంకటరమణ, డీటీ మనోహర్‌రెడ్డి, మున్పిపల్‌ వైస్‌ చైర్మన్‌ బంగారు మునిరెడ్డిలతో ఎమ్మెల్యే  కలెక్టర్‌ను కలిసి గత 30 ఏళ్ళ క్రితం బొల్లవరం రైతులతో మున్పిపాలిటీ భూములను కొనుగోలు చేసిందనిఆ భూములను లేఅవుట్‌ వేసి 12 ఏళ్ల క్రితం విక్రయించిందన్నారు. గతంలో ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు అయ్యాయని నేడు 2017 లో ఆ భుములు చుక్కల భూములుగా 22ఏ కింద పెట్టడంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిలిచిపోయి ప్లాట్లవిక్రయాలు జరగక మున్పిపాలిటికి ఆదాయం దెబ్బతింటోందన్నారు. ఈ భూములపై గత మేలో తహసీల్దారు నివేదికను పంపారన్నారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి ఫైల్‌ ఇంకా రాలేదని తెప్పించుకోని త్వరలో క్లియర్‌ చేస్తామని కలెక్టర్‌  చెప్పారని పేర్కొన్నారు.

Updated Date - 2021-12-04T04:47:54+05:30 IST