22 ఏళ్ల బీటెక్ కుర్రాడి అతి తెలివి.. డబ్బు సంపాదించేందుకు మాస్టర్ ప్లాన్.. బంగారం కొని ఆన్‌లైన్లో డబ్బులు చెల్లించి..

ABN , First Publish Date - 2021-12-11T21:11:38+05:30 IST

ఆ కుర్రాడికి ప్రస్తుతం 22ఏళ్లు. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. డబ్బులు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తూ.. తన అతి తెలివితో మాస్టర్ ప్లాన్ వేశాడు. రద్దీగా ఉండే నగల దుకాణాలను టార్గెట్ చే

22 ఏళ్ల బీటెక్ కుర్రాడి అతి తెలివి.. డబ్బు సంపాదించేందుకు మాస్టర్ ప్లాన్.. బంగారం కొని ఆన్‌లైన్లో డబ్బులు చెల్లించి..

ఇంటర్నెట్ డెస్క్: ఆ కుర్రాడికి ప్రస్తుతం 22ఏళ్లు. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. డబ్బులు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తూ.. తన అతి తెలివితో మాస్టర్ ప్లాన్ వేశాడు. రద్దీగా ఉండే నగల దుకాణాలను టార్గెట్ చేసి, ఆన్‌లైన్‌లో డబ్బుల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకోగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


నిఖిల్ సుధీర్ జైన్ అనే 22ఏళ్ల కుర్రాడు ఔరంగాబాద్‌లో నివాసం ఉంటూ స్థానికంగా ఉన్న  ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఎలాగైనా డబ్బు సంపాదించి.. జీవితంలో స్థిరపడాలనుకున్నాడు. ఇందుకోసం ఓ మాస్టర్ ప్లాన్‌ వేశాడు. రద్దీగా ఉండే నగల దుకాణాలను టార్గెట్ చేసూ.. బంగారం తీసుకుని, ఆన్‌లైన్ పేమెంట్ పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తాజాగా ఓ షాప్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా విచారణ జరిపిన అధికారులు.. నిఖిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత  తమ స్టైల్లో అడగడంతో చేసిన తపు ఒప్పుకున్నాడు. 



ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ఓ ఫేక్ పేమెంట్ యాప్ ద్వారా డబ్బులు చెల్లించినట్టు చూపించి, నిఖిల్ బంగారం కొనుగోలు చేసేవాడని పేర్కొన్నారు. అంతేకాకుండా యూట్యూబ్‌లో వీడియోలను చూసి, ఫేక్ పేమెంట్ యాప్‌ గురించి నిఖిల్ తెలుసుకున్నట్టు వెల్లడించారు. నిఖిల్ దగ్గర నుంచి ఖరీదైన ఫోను, స్కూటర్, 105 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వీటితోపాటు రూ.5లక్షల విలువైన వస్తువులను నిఖిల్ దగ్గర గుర్తించినట్టు తెలిపారు. అవికూడా ఫేక్ పేమెంట్ యాప్‌ను ఉపయోగించే.. కొనుగోలు చేసి ఉంటాడని అభిప్రాయపడ్డాడు. నిఖిల్ చేతిలో చాలా మంది వ్యాపారులు మోసపోయారని.. వారంతా ఇపుడిపుడే తమను సంప్రదిస్తున్నారని అధికారులు వెల్లడించారు.  


Updated Date - 2021-12-11T21:11:38+05:30 IST