2268 ఎకరాల్లో పంట నీటిపాలు

ABN , First Publish Date - 2022-08-10T05:46:09+05:30 IST

నియోజకవర్గ వ్యాప్తంగా వారం రోజులు గా కురిసిన భారీ వర్షాలు రైతన్నను నట్టేట ముంచాయి. దీనికి తో డు ఎగువన ఉన్న కర్ణాటక ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో పంటలన్నీ నీట మునిగాయి.

2268 ఎకరాల్లో పంట నీటిపాలు
వర్షపు నీటిలో కుళ్లిన పూల మొక్కలు

రైతన్నను దెబ్బతీసిన భారీ వర్షాలు, వరదలు

చేతికొచ్చిన పంట నీటిలోనే కుళ్లిన వైనం

నష్టపరిహారం కోసం బాధిత రైతుల ఎదురుచూపు


మడకశిర, ఆగస్టు 9: నియోజకవర్గ వ్యాప్తంగా వారం రోజులు గా కురిసిన భారీ వర్షాలు రైతన్నను నట్టేట ముంచాయి. దీనికి తో డు ఎగువన ఉన్న కర్ణాటక ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో పంటలన్నీ నీట మునిగాయి. రోజుల తరబడి నీరంతా పొ లాల్లోనే నిల్వ ఉండడంతో పంటంతా కుళ్లిపోయింది. ఈక్రమంలో మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 2268 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికం గా అంచనా వేశారు. వేరుశనగ 265 ఎకరాలు, పత్తి 1442, మొక్కజొన్న 481, పొద్దుతిరుగుడు 28, రాగి పంట 9 ఎకరాల్లో నష్టం వా టిల్లినట్లు వ్యవసాయ శాఖ ఏడీ కృష్ణమీనన వెల్లడించారు. కాగా చాలా గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని పొలాల్లో నీరు ఇప్పుడిప్పు డే ఇంకుతుండడంతో పంట పైకి తేలుతోంది. ఈపరిస్థితుల్లో పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వే స్తున్నారు.  చాలా గ్రామాల్లోని చెరువులు మరువ పారాయి. దశాబ్దాల తర్వాత ఈ చెరువులకు నీరు రావడంతో మరువ నీరు పో యే కాలువలు, వంకలు తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో మరువ నీరంతా సమీప పొలాల్లోకి చొరబడి పంటలను కప్పేయడంతో తీ వ్ర నష్టం వాటిల్లింది. హళ్ళికెర గ్రామ రైతు శివన్న మాట్లాడుతూ రెండు ఎకరాల్లో సాగుచేసిన పత్తిపంట చేతికివచ్చే సమయంలో నీ ట మునిగి తీవ్రంగా నష్టపోయినట్లు వాపోయాడు. దెబ్బతిన్న పం టకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. వ్యవసాయ శాఖ ఏడీ కృష్ణమీనన మాట్లాడుతూ పంట న ష్టంపై ఇప్పటివరకు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి, నివేదికను ప్రభుత్వానికి పంపుతామని పేర్కొన్నారు. 


పూలతోటలకు తీరని నష్టం

గుడిబండ: మండలంలోని మోపురుగుండు గ్రామ రైతులు లిం గప్ప, ఎం లింగప్ప సాగుచేసిన పూలతోటలు వర్షం దెబ్బకు కుళ్లిపో యాయి. తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు వాపోయారు. లింగప్ప 1.20 ఎకరాలు, ఎం లింగప్ప 75 సెంట్లలో పూలమొక్కలు సాగుచేశారు. అధిక వర్షాల కారణంగా పూలతోటల్లో నీరు నిలిచా యి. రోజుల తరబడి నీరు బయటకు పోయే వీలు లేక, మొక్క వే ర్లు కుళ్లిపోయాయి. సాగు కోసం సుమారు రూ.లక్ష దాకా ఖర్చుచేశామని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Updated Date - 2022-08-10T05:46:09+05:30 IST