కలెక్టర్ వాహనంపై 23 చలాన్లు

ABN , First Publish Date - 2021-09-07T21:36:59+05:30 IST

అతి వేగంగా ప్రయాణించినందుకు కలెక్టర్ వాహనానికి కూడా పోలీసులు చలాన్లు

కలెక్టర్ వాహనంపై 23 చలాన్లు

జనగామ: అతి వేగంగా ప్రయాణించినందుకు కలెక్టర్ వాహనానికి కూడా పోలీసులు చలాన్లు విధించారు. ఏకంగా జనగామ జిల్లా కలెక్టర్ ప్రయాణించే అధికారిక వాహనంపై 23 చలాన్లు విధించారు. కలెక్టర్ వినియోగించే TS 27 A 0001 నంబరు గల కారు అతివేగంతో ప్రయాణించినందుకు 23 చలాన్లను పోలీసులు విధించారు. 2020 ఫిబ్రవరి నుంచి 2021 ఆగస్టు 30 వరకు ఈ చలాన్లను విధించారు. ఈ వాహనంపై రూ. 22,905మ విలువ గల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. తమకు కలెక్టర్ అయినా, సామాన్యులైనా సమానులేనని పోలీసులు భావించి చలాన్లు విధించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 



Updated Date - 2021-09-07T21:36:59+05:30 IST