అతడికి 23, ఆమెకు 60 ఏళ్లు.. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

ABN , First Publish Date - 2021-06-12T02:36:10+05:30 IST

ప్రేమ గుడ్డిందంటారు. దానికి కులం, మతం, వయోబేధం లేదని చెబుుతుంటారు. కులం, మతం సంగతి అటుంచితే.. ఓ జంట మాత్రం తమ ప్రేమకు వయో బేధం లేదని నిరూపించారు. వారి ప్రేమ వ్యవహారం.. ఆ

అతడికి 23, ఆమెకు 60 ఏళ్లు.. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

వాషింగ్టన్: ప్రేమ గుడ్డిదంటారు. దానికి కులం, మతం, వయోబేధం లేదని చెబుుతుంటారు. కులం, మతం సంగతి అటుంచితే.. ఓ జంట మాత్రం తమ ప్రేమకు వయో బేధం లేదని నిరూపించారు. వారి  ప్రేమ వ్యవహారం.. ఆ నోట ఈ నోటపాకి సోషల్ మీడియాలోకి చేరింది. దీంతో ప్రస్తుతం ఆ ప్రేమ కహాని నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. విషయంలోకి వెళితే..



చెర్లి మాట్లాడుతూ.. ‘మా బంధం నిజాయితీతో కూడుకొని ఉంది. ఆకారం ముఖ్యం కాదు. ఒకరినొకరం ఎలా అర్థం చేసుకుంటున్నామన్నదే ముఖ్యం. అన్నింటికీ మించి.. మనసు చూసి మేము ఒకరినొకరం ఇష్టపడ్డాం. నా కొడుకులు క్వారిన్ కంటే మూడేళ్లు పెద్దవారు. వారు కూడా మా బంధాన్ని అర్ధం చేసుకుని, మనస్ఫూర్తిగా అంగీకరించారు. మేమేం తప్పు చేయడం లేదు. ఇద్దరం కలిసి రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటాం. మమ్మల్ని అర్థం చేసుకోకుండా తప్పుపట్టే వారిని మేం అస్సలు పట్టించుకోం. మా దృష్టిలో వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే’ అని పేర్కొన్నారు.   



అమెరికాకు చెందిన 23ఏళ్ల క్వారిన్ అనే యువకుడు.. 60ఏళ్ల వయసున్న చెర్లి అనే మహిళ ప్రేమలో పడ్డారు. అంతేకాకుండా ఇద్దరు కలిసి డ్యాన్స్, రోమాన్స్ చూస్తూ వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీటిని చూసిన నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్ చేస్తుండటంతో తాజాగా తమ ప్రేమ వ్యవహారంపై ఆ జంట స్పందించింది. వయసు అనేది జస్ట్ నంబర్ మాత్రమే అంటూ నెటిజన్లకు  బదులిస్తోంది.




Updated Date - 2021-06-12T02:36:10+05:30 IST