రాయదుర్గంలో240 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-05-17T05:20:29+05:30 IST

నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కరోనా కోరలు చాస్తోంది. ఆదివారం రికార్డు స్థాయిలో నియోజకవర్గంలో 240 పాజిటివ్‌ కేసులు న మోదయ్యాయి.

రాయదుర్గంలో240 పాజిటివ్‌ కేసులు

రాయదుర్గం, మే 16 : నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కరోనా కోరలు చాస్తోంది. ఆదివారం రికార్డు స్థాయిలో నియోజకవర్గంలో 240 పాజిటివ్‌ కేసులు న మోదయ్యాయి. పట్టణంలో అత్యధికంగా 80 కేసులు, గు మ్మఘట్టలో 42, బొమ్మనహాళ్‌లో 42, కణేకల్లులో 40, రా యదుర్గం రూరల్‌లో 25, డీ హీరేహాళ్‌లో 11 కేసులు న మోదయ్యాయి. కరోనా సెకెండ్‌ వేవ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. 


తాడిపత్రిలో 62..

తాడిపత్రిటౌన : పట్టణంలో ఆదివారం 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌ తెలిపారు. బంకమడివీధి, పోరాటకాలనీ, జయనగర్‌కాలనీ, నందలపాడు, నంద్యాలరో డ్డు, సంజీవనగర్‌ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయన్నారు. అదేవిధంగా బంకమడి వీధిలోని 77 సంవత్సరా ల వృద్ధురాలు కరోనాతో మృతిచెందినట్లు తెలిపారు. 


గుమ్మఘట్టలో 45..

గుమ్మఘట్ట : మండలంలోని వివిధ గ్రామాల్లో ఆ దివారం 45 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. గుమ్మఘట్టలో 4, కలుగోడులో 6, భూపసముద్రంలో 12, రంగసముద్రంలో 9, గోనబావిలో 6, పూలకుంటలో 3, బేలోడులో 3, 75 వీరాపురం, శిరిగేదొడ్డిలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు పేర్కొన్నారు.  ఇందులో కేసులు ఎక్కువైన గ్రామాల్లో వారం రోజుల క్రి తం కర్ణాటక పరిసర గ్రామాల నుంచి కొంతమంది కొన్ని కార్యక్రమాలకు గుంపులుగా హాజరుకావడంతోనే  ఉధృతమైనట్లు తెలిసింది. 


కూడేరులో 27..

కూడేరు : మండలంలో ఆదివారం 27 మందికి కరో నా నిర్ధారణ అయినట్లు స్థానిక ప్రభుత్వ డాక్టర్‌ లక్ష్మినారాయణ తెలిపారు. వైరస్‌ పల్లెలపై పంజా విసురుతోం ది. కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండ టం, మరణాలు సంఖ్య కూడా అదే స్థాయిలో భయపె డుతుండడతో జనం వణికిపోతున్నారు. మండలంలో  క రోనా సెకెండ్‌ వేవ్‌ ప్రారంభం నుంచి దాదాపు 400 మం ది వరకూ వైరస్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం 145 యా క్టివ్‌ కేసులు ఉన్నట్లు డాక్టర్‌ తెలిపారు. ఇప్పటికే అధికారికంగా పది మంది మృతి చెందగా, అనధికారికంగా మ రో ఐదుగురు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నా రు. వైరస్‌ విజృంభించినప్పటి నుంచి ప్రైవేట్‌ క్లినిక్‌లు కి టకిటలాడుతున్నాయి. కర్ఫ్యూ నిబంధనలు పెట్టినప్పటికీ గ్రామాల్లో ప్రజలు బయట తిరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 


రాయదుర్గం రూరల్‌లో 24..

రాయదుర్గం రూరల్‌ : మండలంలోని వివిధ గ్రా మాల్లో ఆదివారం 24 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు పీహెచసీ వైద్యుడు సతీష్‌ రెడ్డి, తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. టీ వీరాపురంలో 8, 74 ఉడేగోళంలో 9, మల్లాపురంలో 3, పల్లేపల్లి, ఆవులదట్ల, వేపరాల, బీఎనహళ్లిలో ఒక్కో పాజిటివ్‌ కేసు చొప్పున నమోదైనట్లు పే ర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామ ప్రజలు సహకరించాలని వారు కోరారు. 


పుట్లూరులో 15..

పుట్లూరు: మండలవ్యాప్తంగా 15 కరోనా పాజిటివ్‌ కే సులు నమోదయ్యాయని వైద్యాధికారిణి శ్రీవాణి ఆదివా రం తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులను అనంతపు రం ఐసోలేషనకు తరలించామన్నారు. కర్ఫ్యూలో ప్రజలు అనవసరంగా బయట తిరగకూడదన్నారు.


కరోనాతో మాజీ ఉపసర్పంచు మృతి

గుంతకల్లు టౌన, మే 16: మండలంలోని కసాపురం మాజీ ఉపసర్పంచు శ్రీరాములు (42) కరోనాతో ఆదివా రం మృతి చెందాడు. నాలుగురోజుల క్రితం కరోనా నిర్ధారణ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య శాంతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు సం తాపం తెలియజేశారు.


కొవిడ్‌ పరీక్షల ఫలితాల్లో తీవ్ర జాప్యం

బెళుగుప్ప, మే 16: మండలంలోని వెంకటాద్రిపల్లి గ్రామస్థులు కరోనా పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామంలో ఓ మహిళ కరోనాతో మృతి చెంద గా, వైద్యాధికారులు అవగాహన కల్పించారు. వైరస్‌ నిర్ధారణ నిమిత్తం ఈనెల 10న 28 మందికి  నమూనాలు సేకరించారు. వారం గడిచినా ఫలితాలు తెలపకపోవడం తో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. పరీక్షలు చేశారు.. ఎవరికి పాజిటివ్‌ లక్షణాలున్నాయో తెలుసుకునేదెలాఅంటూ వాపోతున్నారు. అధికారులను సంప్రదించగా ఇంతవరకు మీ గ్రామ రిపోర్టులు చెబుతున్నారని గ్రామస్థుడు రాధాకృష్ణ తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫలితాలు వెల్లడించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-05-17T05:20:29+05:30 IST