రాజేంద్రనగర్‌ క్వారంటైన్‌లో 241 మంది

ABN , First Publish Date - 2020-06-01T10:53:07+05:30 IST

దుబాయ్‌, ఖతర్‌, రియాద్‌ నుంచి వచ్చిన 241 మందికి రాజేంద్రనగర్‌ ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల్లో బస ఏర్పాటు చేశారు. రంగారెడ్డి

రాజేంద్రనగర్‌ క్వారంటైన్‌లో 241 మంది

రాజేంద్రనగర్‌, మే 31(ఆంధ్రజ్యోతి): దుబాయ్‌, ఖతర్‌, రియాద్‌ నుంచి వచ్చిన 241 మందికి రాజేంద్రనగర్‌ ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల్లో బస ఏర్పాటు చేశారు. రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ పర్యవేక్షణలో రాజేంద్రనగర్‌ ఆర్డీవో  చంద్రకళ, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌గౌడ్‌ వారికి ఏర్పాట్లు చేస్తున్నారు.


మూడు రోజుల క్రితం దుబాయ్‌ నుంచి వచ్చి ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లలో ఉండేందుకు ఇష్టపడిన 83 మందిని రాష్ట్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌(టీఎ్‌స-ఐఆర్‌డీ)లోని శయనం హాస్టల్‌లో పెట్టారు. ఖతర్‌ నుంచి వచ్చిన 72 మందిని టీఎ్‌స-ఐఆర్‌డీ లోని ప్రకృత్రి, ప్రేరణ హాస్టల్‌లో ఉండడానికి ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి రియాద్‌ నుంచి వచ్చిన 86 మందిని తెలంగాణ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు(టీఎ్‌స-క్యాబ్‌)కు చెందిన వసతి గృహాల్లో ఉంచారు. 


 150మంది మహిళలకు న్యాక్‌లో బస

దుబాయ్‌ నుంచి వచ్చిన 150 మంది మహిళలను కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశాల మేరకు మాదాపూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌లో బస ఏర్పాటు చేశారు. 


ఆదివారం రాత్రి మరో రెండు విమానాల్లో

ఆదివారం రాత్రి రియాద్‌, దుబాయ్‌ నుంచి మరో రెండు విమానాలలో ప్రయా ణికులు వచ్చే అవకాశం ఉందని రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ చంద్రశేఖర్‌గౌడ్‌ తెలిపారు. వారిలో ఎవరైనా ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంటామంటే టీఎ్‌స-క్యాబ్‌తో పాటు ఎక్స్‌టెన్షన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(ఈటీసీ) లలో ఉంచుతామని వెల్లడించారు. 

Updated Date - 2020-06-01T10:53:07+05:30 IST