25 రోజులు.. 12 హత్యలు

ABN , First Publish Date - 2022-01-21T06:02:02+05:30 IST

వరకట్నం...మంత్రాలు...అక్రమ సంబంధం...అప్పు తీర్చకపోవడం... కుటుంబ తగదాలు...భూ వివాదం...

25 రోజులు.. 12 హత్యలు

భయాందోళనలో జిల్లా ప్రజలు 

కలవర పెడుతున్న నేరాలు

జగిత్యాల, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): వరకట్నం...మంత్రాలు...అక్రమ సంబంధం...అప్పు తీర్చకపోవడం... కుటుంబ తగదాలు...భూ వివాదం... చిన్న పాటి గొడవలు ఇలా పలు కారణాలు హత్యకు దారితీస్తున్నాయి. జిల్లాలో కొన్ని రోజులుగా హత్యలు పెరుగుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏదో ఒక చోట వరసగా హత్యా సంఘటనలు చోటు చేసు కుంటుండడం కలవరపెడుతోంది. సుమారు పాతిక రోజుల్లో 12 హత్య లు జరగడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఒక వైపు నేరాల నియంత్ర ణకు పోలీసులు పలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరో వైపు హత్యా నేరాలు పెరుగుతుండడం జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. 

పెరుగుతున్న నేరాలు...

జగిత్యాల జిల్లాలో సుమారు నెల రోజులగా హత్యా నేరాలు పెరు గుతున్నాయి. జిల్లాలో 2019లో 14 హత్యలు, 2020లో 23 హత్యలు జరిగాయి. 2021లో జరిగిన 25 హత్య సంఘటనల్లో 3 హత్యలు భూ వివాదాలు, 4 హత్యలు సెక్సువల్‌ కారణాలు, పాత కక్షలతో 5 హత్యలు, 1 వరకట్నం, 2 చేతబడి, 5 చిన్నపాటి గొడవల కారణంగా హత్యలు జరి గాయి. ప్రస్తుత మాసంలో నేరాల సంఖ్య పెరుగుతోంది. గడిచిన పాతిక రోజుల్లో 12 హత్యలు జరగడం దారుణం. ఇందులో ప్రధానంగా రెండు సంఘటనల్లో మంత్రాలు చేస్తున్నారన్న కారణంగా 4 హత్యలు జరగడం కలవరపెడుతోంది.

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు...

ఫ ఈనెల 9వ తేదీన జగిత్యాల మండలం దరూరులో ఈరిశెట్టి రాజేశ్‌ అనే వ్యక్తిని తల్వార్‌తో పొడిచి, గొంతుకోసి చంపారు. కేవలం భూ వివాదం, పాత కక్షల కారణంగా  హత్య సంఘటన చోటుచేసుకుంది.

ఫ ఈనెల 13వ తేదీన ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్‌లో రాజేందర్‌ అనే నాయకున్ని భూ వివాదం కారణంగా తన పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హతమార్చారు.

ఫ14వ తేదీన మల్లాపూర్‌ మండలంలోని రాఘవపేట గ్రామంలో టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు మామిడి లస్మయ్య హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం, పాతకక్షల కారణంగా లస్మయ్య హత్యకు గురయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఫ14వ తేదీన వెల్గటూరు మండలంలోని సూరారం గ్రామంలో దుర్గం చంద్రయ్య అను వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం సేవించి నిత్యం ఇంట్లో గొడవపడుతుండడంతో అతని కుమారుడు పవన్‌ కర్రతో చంద్రయ్యను కొట్టడంతో మృతి చెందాడు. 

ఫ17వ తేదీన మేడిపల్లి మండలంలోని కల్వకోటలో నడీరోడ్డుపై ప్రజలు చూస్తుండగా మల్లయ్య అను వృద్ధుడిని అతడి మనవడు చందు రాయితో కొట్టి చంపాడు. మానసిక పరిస్థితి సరిగా లేనందున చందు తన తాత అయిన మల్లయ్యను కొట్టి చంపినట్లు గ్రామస్థులు అంటున్నారు.

ఫ 20వ తేదీన జగిత్యాలలోని తారకరామ నగర్‌లో జగన్నాథం నాగేశ్వర్‌ రావు, అతని కుమారులు రాంబాబు, రమేశ్‌లు ఎరుకుల సం ఘ భవనంలో దారుణంగా హత్యకు గురయ్యారు. మంత్రాలు చేస్తు న్నారన్న అనుమానంతో వారిని హత్య చేసినట్లు తెలుస్తోంది. 

గత యేడాది డిసెంబరు చివరి వారంలో...

ఫ 2021 డిసెంబరు 26వ తేదీన మల్యాల మండలం గొర్రెగుండంలో సుంకె దుబ్బయ్య అను వృద్ధుడు కల్లు మండువాలో ఉండగా ఓ వ్యక్తి కొట్టి చంపాడు. మంత్రాల నెపంతో హత్య జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఫ 2021 డిసెంబరు 28వ తేదీన కొడిమ్యాల మండలంలోని కోనా పూర్‌లో జడ రాజవ్వ అను వృద్ధురాలు హత్యకు గురయింది. రాజవ్వను ఆమె అల్లుడు అదనపు కట్నంతో పాటు కూతురును కాపురానికి పం పాలని గొడవ పడి దాడి చేసి హతమర్చినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫ 2021 డిసెంబరు 28వ తేదీన మెట్‌పల్లి పట్టణంలోని బోయ వాడలో నివాసముంటున్న నిషిత అను వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే నిషితను ఆమె భర్త కిషోర్‌ తాడుతో ఉరివేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఫ 2021 డిసెంబరు 30న జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఖిల్లా కంద కంలో ఖాజాహమీదొద్దిన్‌ అను వృద్ధుడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. అయితే ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి జగిత్యాలకు చెందిన హమీదొద్దిన్‌ను మరొకరి సాయంతో ఉరివేసి చంపి ఖిల్లా కందకంలో పారేసినట్లు పోలీసులు గుర్తించారు.


Updated Date - 2022-01-21T06:02:02+05:30 IST