అమెరికాలో ఎంత మంది ఉద్యోగం కోల్పోయారంటే..

ABN , First Publish Date - 2020-04-09T21:04:05+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా అమెరికా వ్యాప్తంగా 25 శాతం మంది ఉద్యోగాలు కోల్పోవడం లేదా జీతంలో కోతను ఎదుర్కొంటున్నారు. అమెరికా ఎకనామిక్

అమెరికాలో ఎంత మంది ఉద్యోగం కోల్పోయారంటే..

వాషింగ్టన్: కరోనా మహమ్మారి కారణంగా అమెరికా వ్యాప్తంగా 25 శాతం మంది ఉద్యోగాలు కోల్పోవడం లేదా జీతంలో కోతను ఎదుర్కొంటున్నారు. అమెరికా ఎకనామిక్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో దేశవ్యాప్తంగా 800 మంది అమెరికన్లు పాల్గొన్నారు. వీరిలో పది శాతం మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు తెలిపారు. 16 శాతం మంది సగం జీతమే పడినట్టు పేర్కొన్నారు. ఇక 8 శాతం మంది రానున్న రోజుల్లో తమ జీతంలో కోత విధించే అవకాశముందని చెప్పగా, 1 శాతం మంది ఉద్యోగం పోయే అవకాశమున్నట్టు చెప్పారు. అయితే వీరిలో చాలా మంది అమెరికా ఆర్థిక రంగం వచ్చే ఏడాది కల్లా తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 11, 2001 దాడులు, 2008 మాంద్యం సమయంలో ఉన్న దాని కంటే ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ బానే ఉందని చెప్పిన వారి సంఖ్య 22 శాతానికి పడిపోయింది. కాగా.. అమెరికాలో ఇప్పటివరకు మొత్తంగా 4,35,160 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కారణంగా అమెరికా వ్యాప్తంగా 14,797 మంది చనిపోయారు. 

Updated Date - 2020-04-09T21:04:05+05:30 IST