2500 రైల్వే వైద్యులు అందుబాటులోకి..

ABN , First Publish Date - 2020-04-09T09:42:26+05:30 IST

కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రోగులకు చికిత్స అందించడానికి 2,500 మంది వైద్యులు, 35 వేల మంది పారామెడికల్‌ సిబ్బంది, నర్సులను సిద్ధం చేశామని రైల్వే అధికారులు తెలిపారు

2500 రైల్వే వైద్యులు అందుబాటులోకి..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రోగులకు చికిత్స అందించడానికి 2,500 మంది వైద్యులు, 35 వేల మంది పారామెడికల్‌ సిబ్బంది, నర్సులను సిద్ధం చేశామని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే శాఖలోని వైద్య, ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 16 జోనల్‌ ఆస్పత్రులు, 56 డివిజనల్‌ ఆస్పత్రులు, 45 సబ్‌డివిజనల్‌ ఆస్పత్రులు, 586 హెల్త్‌ యూనిట్లు, 8 ప్రొడక్షన్‌ యూనిట్లు ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటనలో వివరించింది. కాగా,  రైల్వేపై కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా పడింది. ఫిబ్రవరిలోపే సరుకు రవాణాలో లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్న రైల్వే.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 15.7 మిలియన్‌ టన్నుల తక్కువ సరుకును రవాణా చేసింది. 

Updated Date - 2020-04-09T09:42:26+05:30 IST