Abn logo
Sep 16 2021 @ 08:13AM

‘ట్రిపుల్‌ ఐటీ’ మాక్‌టెస్ట్‌కు 256 మంది హాజరు

బాపట్ల టౌన్‌: పట్టణంలోని స్థానిక భావపురి విద్యాసంస్థలో ఇంజనీర్స్‌ డే సందర్భంగా నిర్వహించిన ట్రిపుల్‌ ఐటీ మాక్‌టె్‌స్టలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి 256 మంది విద్యార్థులు హాజరయ్యారని భావపురి విద్యాసంస్థల ప్రిన్సిపాల్‌ ఆవుల వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు మాట్లాడుతూ మాక్‌టె్‌స్టలో విద్యార్థులు తమ ప్రతిభను చాటి బహుమతులు సాధించాలన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎ.శ్రీనివాసరావును, విద్యుత్‌శాఖ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పెరుగు శ్రీనివాసరావు, నీటి పారుదల శాఖ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ దాసరి భరద్వాజలను సన్మానించారు. కార్యక్రమంలో దాసరి శివకుమార్‌, దాసరి చినభూషణ, టి.శ్రీనివాసరావు, వై.రామకృష్ణ, జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption