ఒక్కడి కారణంగా.. 26 వేల మంది సెల్ప్ ఐసోలేషన్‌లో..

ABN , First Publish Date - 2020-04-06T17:10:02+05:30 IST

భారతదేశంలో కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నాయని అనుకుంటుండగా ఢిల్లీ ఘటన ఒక్కసారిగా బాంబు పేల్చింది. ఢిల్లీలో తబ్లీగీ జమాత్‌కు హాజరైనవారు, వారితో సంబంధం ఉన్నవారి వల్లే

ఒక్కడి కారణంగా.. 26 వేల మంది సెల్ప్ ఐసోలేషన్‌లో..

భోపాల్: భారతదేశంలో కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నాయని అనుకుంటుండగా ఢిల్లీ ఘటన ఒక్కసారిగా బాంబు పేల్చింది. ఢిల్లీలో తబ్లీగీ జమాత్‌కు హాజరైనవారు, వారితో సంబంధం ఉన్నవారి వల్లే దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు అత్యధికంగా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పుడు ఇలాంటిదే మరో ఘటన బయటకు వస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఎన్నారై తన తల్లి మరణించిందని మార్చి 17న దుబాయి నుంచి మధ్యప్రదేశ్‌లోని మొరెనా నగరానికి వచ్చాడు. మార్చి 20వ తేదీన తన తల్లి అంత్యక్రియల విందును ఏర్పాటు చేశాడు. ఈ విందుకు దాదాపు 1500 మందికి పైగా హాజరైనట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 2వ తేదీన ఆ వ్యక్తికి, తన భార్యకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. కరోనా లక్షణాలు కనపడటంతో ఈ జంట మార్చి 27న ఆసుపత్రికి వచ్చినట్టు డాక్టర్లు వివరించారు. వారిని వెంటనే ఐసోలేషన్ వార్డుకు పంపి శాంపిల్స్‌ను పరీక్షకు పంపగా.. కరోనా పాజిటివ్ వచ్చిందని డాక్టర్లు వెల్లడించారు. 


మరోపక్క ఈ జంటతో కాంటాక్ట్ అయిన 10 మందికి ఏప్రిల్ 3వ తేదీన కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యక్తి నుంచి వివరాలన్నీ ఆరా తీయగా.. అంత్యక్రియల విందులో 1500 నుంచి 2 వేల మంది హాజరైనట్టు తమకు తెలిసిందని అధికారులు చెప్పారు. ఈ విందుకు హాజరైన వారు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మొత్తంగా ఇప్పటివరకు 27,881 మందిని గుర్తించి సెల్ప్ ఐసోలేషన్‌లో ఉంచినట్టు అధికారులు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి విందుకు హాజరైన వారిని కూడా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ విందుతో సంబంధం ఉన్న 24 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలియజేశారు. విదేశాల నుంచి వచ్చినట్టు దాచి, ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు నమోదు చేసి జైలుకు పంపుతామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం హెచ్చరించారు.

Updated Date - 2020-04-06T17:10:02+05:30 IST