Abn logo
May 13 2021 @ 23:50PM

2646 కేసులు... 9 మరణాలు

తిరుపతి, మే 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధ, గురువారాల నడుమ 24 గంటల వ్యవధిలో 2646 కరోనా పాజిటివ్‌ కేసులు, తొమ్మిది మరణాలూ నమోదైనట్లు బుధవారం ఉదయం రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌ పేర్కొంది. కాగా తాజా కేసులతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 148460కు చేరుకోగా గురువారం ఉదయానికి 22185 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నట్టు పేర్కొన్నారు. ఇక మరణాల సంఖ్య 1068కి చేరాయి. తాజా కేసుల్లో తిరుపతి నగరంలో 451, తిరుపతి రూరల్‌ మండలంలో 348, చిత్తూరులో 296 వున్నాయి. శ్రీకాళహస్తిలో 125. పెనుమూరులో 100, పుంగనూరులో 65, మదనపల్లెలో 60, పాకాలలో 57, పూతలపట్టు, ఏర్పేడుల్లో 55, రేణిగుంటలో 46, బంగారుపాలెం, కుప్పం, యాదమరిల్లో 44 చొప్పున, పుత్తూరులో 42, శాంతిపురంలో 41, పెద్దపంజాణిలో 40, ఐరాలలో 38, పులిచెర్లలో 36, సోమలలో 35, గంగవరంలో 34, చౌడేపల్లెలో 32, తవణంపల్లెలో 30, నాగలాపురం, తంబళ్ళపల్లెల్లో 28 వంతున, కార్వేటినగరం, వి.కోటల్లో 27 వంతున, గుర్రంకొండ, రామసముద్రాల్లో 26, తొట్టంబేడు, వెదురుకుప్పాల్లో 23 వంతున, సదుంలో 22, వరదయ్యపాలెంలో 19, పలమనేరు, పీలేరుల్లో 16 వంతున, కలికిరిలో 15, బీఎన్‌ కండ్రిగ, చంద్రగిరి, రామకుప్పాల్లో 14 వంతున, పీటీఎం, రామచంద్రాపురం, గుడుపల్లె మండలాల్లో 13 వంతున, గుడిపాల, వాల్మీకిపురాల్లో 12 వంతున, ములకలచెరువు, వడమాలపేట, విజయపురాల్లో 11 వంతున, నగరి, సత్యవేడుల్లో 10 చొప్పున, పెద్దమండ్యంలో 9, కేవీబీపురం, కలకడల్లో 7 వంతున, బి.కొత్తకోట, బైరెడ్డిపల్లె, పిచ్చాటూరు మండలాల్లో 6 చొప్పున, చిన్నగొట్టిగల్లు, జీడీనెల్లూరు, కురబలకోట, పాలసముద్రం, రొంపిచెర్ల, ఎర్రావారిపాలెం మండలాల్లో 4 వంతున, నారాయణవనంలో 3, కేవీపల్లె, నిమ్మనపల్లె మండలాల్లో 2 చొప్పున, నిండ్ర, శ్రీరంగరాజపురాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.


ప్రభుత్వ కొవిడ్‌ సెంటర్లలో  548 పడకల ఖాళీ 

తిరుపతిలోని ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో గురువారం రాత్రి 10  గంటలకు మొత్తం 548 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. తిరుచానూరులోని పద్మావతి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఖాళీలు లేవు.  విష్ణు నివాసంలో 173, శ్రీనివాసంలో 140, రుయాలో 99 (ఆక్సిజన్‌ 3, నాన్‌ ఆక్సిజన్‌ 96), ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 55 (ఆక్సిజన్‌ 0, నాన్‌ ఆక్సిజన్‌ 55), ఆయుర్వేద వైద్యశాలలో 24 నాన్‌ ఆక్సిజన్‌ బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. టీటీడీ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన మాధవంలో 57 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.


Advertisement