2708 కరోనా కేసులు... 8 మరణాలు

ABN , First Publish Date - 2021-05-15T06:08:20+05:30 IST

చిత్తూరు జిల్లాలో గురు, శుక్రవారం 2708 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి

2708 కరోనా కేసులు... 8 మరణాలు

తిరుపతి, మే 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురు, శుక్రవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 2708 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి .వైరస్‌కు మరో ఎనిమిదిమంది బలయ్యారు.తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 151168కి చేరుకోగా శుక్రవారం ఉదయానికి 22169 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నట్టు ప్రభుత్వ బులెటిన్‌ పేర్కొంది. ఇక మరణాల సంఖ్య 1076కి పెరిగింది.తాజా కేసుల్లో చిత్తూరులో 256, తిరుపతి నగరంలో 229, పలమనేరులో 167, శ్రీకాళహస్తిలో 156, మదనపల్లెలో 153, పీలేరులో 121, కలికిరిలో 103 కేసులు నమోదయ్యాయి. తిరుపతి రూరల్‌ మండలంలో 95, కుప్పం, కురబలకోట మండలాల్లో 89 వంతున, రేణిగుంటలో 69, రొంపిచెర్ల, శాంతిపురాల్లో 62 వంతున, చిన్నగొట్టిగల్లులో 53, వాల్మీకిపురంలో 49, నగరిలో 47, నిమ్మనపల్లె, రామకుప్పం మండలాల్లో 44వంతున, బైరెడ్డిపల్లె, ఏర్పేడు మండలాల్లో 43వంతున, గంగవరం, పాకాల, యాదమరి మండలాల్లో 41వంతున, ఎర్రావారిపాలెంలో 35, చంద్రగిరి, పెద్దమండ్యం మండలాల్లో 34 వంతున, పూతలపట్టులో 33, కలకడలో 31, కేవీపల్లెలో 30, బి.కొత్తకోట, కేవీబీపురాల్లో 25 వంతున, సత్యవేడులో 23, పీటీఎం, తంబళ్లపల్లె మండలాల్లో 22 వంతున, గుడుపల్లె, పులిచెర్ల మండలాల్లో 21వంతున, గుర్రంకొండ,తొట్టంబేడు మండలాల్లో 19వంతున, చౌడేపల్లెలో 18, శ్రీరంగరాజపురంలో 17, బీఎన్‌ కండ్రిగలో 16, ములకలచెరువు, పుత్తూరు మండలాల్లో 15 వంతున, పెనుమూరులో 14, బంగారుపాలెం, నారాయణవనం, నిండ్ర మండలాల్లో 13వంతున,పుంగనూరు, వెదురుకుప్పం మండలాల్లో 11 చొప్పున, జీడీనెల్లూరులో 10, వరదయ్యపాలెంలో 9, ఐరాలలో 8, వి.కోటలో 6, సదుంలో 5, సోమల, తవణంపల్లె మండలాల్లో 4 చొప్పున, గుడిపాల, పెద్దపంజాణి, వడమాలపేట మండలాల్లో మూడేసి, రామసముద్రంలో 2, కార్వేటినగరం, నాగలాపురం, రామచంద్రాపురం, విజయపురం మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.


జీడీనెల్లూరులో ఊపిరాడక వృద్ధురాలి మృతి

జీడీనెల్లూరు మండలం నెల్లేపల్లె పంచాయతీ కొత్తూరుకు చెందిన రామక్క (68) కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతోంది. శుక్రవారం ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడంతో కుటుంబీకులు సమీపంలోని శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లె మిట్టలో ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్ళగా అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యుడు తెలిపారు. మృతురాలి స్వగ్రామం కొత్తూరు, కన్నికాపురం గ్రామాల్లో పెద్దసంఖ్యలో పిల్లలతో సహా గ్రామస్తులు జ్వరాలతో బాధపడుతున్నట్టు సమాచారం. అవి సీజనల్‌ జ్వరాలా లేక కరోనాకు సంబంధించినవా అన్నది వైద్యారోగ్య శాఖ అధికారులు తక్షణం ఆ గ్రామాల్లో పర్యటించి పరిశీలించాల్సిన అవసరముంది.తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయంలో వుమెన్‌ స్టడీస్‌ విభాగం రిటైర్డు ప్రొఫెసర్‌ పద్మావతి (69) కొవిడ్‌ కారణంగా రుయా ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం మృతి చెందారు.స్టాటిస్టిక్స్‌ విభాగంలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న సునీత (40) కూడా కరోనా సోకడంతో నెల్లూరులో చికిత్స తీసుకుంటూ శుక్రవారం మరణించారు.పుత్తూరు పట్టణం కాపువీధిలోని ప్రాధమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మునస్వామిరెడ్డి (57) కరోనాతో తిరుపతి పద్మావతీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం చనిపోయారు.


కొవిడ్‌కు బలైన టీడీపీ నేత... మాజీ కౌన్సిలర్‌

మదనపల్లె పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు పోతుల విజయ్‌కుమార్‌(48) కరోనాతో అక్కడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు. మదనపల్లె ప్రభుత్వాస్పత్రి సలహాసంఘం అధ్యక్షుడిగా ఆయన గత టీడీపీ ప్రభుత్వంలో రెండు పర్యాయాలు పనిచేశారు.మరోవైపు మదనపల్లె మాజీ కౌన్సిలర్‌ కేసీ రెడ్డెప్ప (55) కరోనాతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం సాయంత్రం చనిపోయారు. ఆయన పట్టణ వాల్మీకి సంఘానికి, రేషన్‌ షాపు డీలర్ల సంఘానికి గౌరవాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2021-05-15T06:08:20+05:30 IST