29 మంది ఖైదీలకు కరోనా.. అందరిలోనూ లక్షణాలు నిల్

ABN , First Publish Date - 2020-06-07T01:57:55+05:30 IST

మహారాష్ట్ర ఔరంగాబాద్‌లోని హర్సూల్ సెంట్రల్ జైలులో ఇటీవల ఓ ఖైదీకి కరోనా సోకింది. అతడి కారణంగా మరో

29 మంది ఖైదీలకు కరోనా.. అందరిలోనూ లక్షణాలు నిల్

ఔరంగాబాద్: మహారాష్ట్ర ఔరంగాబాద్‌లోని హర్సూల్ సెంట్రల్ జైలులో ఇటీవల ఓ ఖైదీకి కరోనా సోకింది. అతడి కారణంగా మరో 29 మంది ఖైదీలకు తాజాగా వైరస్ సంక్రమించినట్టు అధికారి ఒకరు తెలిపారు. వీరిలో 25 మంది సెంట్రల్ జైలు ఖైదీలు కాగా, మిగతా నలుగురు అండర్ ట్రయల్స్ కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఫెసిలిటీకి చెందిన వారని కలెక్టర్ ఉదయ్ చౌధరి తెలిపారు. అయితే, కరోనా పాజిటివ్‌గా తేలిన 29 మందిలోనూ లక్షణాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. కరోనా పరీక్షల కోసం మొత్తం 110 మంది ఖైదీలు, జైలు సిబ్బంది స్వాబ్ సేకరించినట్టు చెప్పారు. 


హర్సూల్ జైలు సామర్థ్యం 539 మంది కాగా, ప్రస్తుతం అందులో దాదాపు 1400 మంది ఉన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1936 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో 90 మంది పాజిటివ్‌గా తేలారు. 686 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1154 మంది డిశ్చార్జ్ అయ్యారు. 96 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.


Updated Date - 2020-06-07T01:57:55+05:30 IST