3 రోజులు తేలికపాటి వర్షాలు

ABN , First Publish Date - 2021-08-02T06:55:33+05:30 IST

రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె.నాగరత్న తెలిపారు.

3 రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె.నాగరత్న తెలిపారు. పశ్చిమ దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని చెప్పారు. కాగా, నిజామాబాద్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో ఆదివారం 29.8, 29.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా... ఇతర జిల్లాల్లో 30 డిగ్రీలకు మించి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం అత్యధికంగా ఖమ్మంలో 34 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, నల్లగొండలో 33 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

Updated Date - 2021-08-02T06:55:33+05:30 IST