#RRR : టోటల్ రన్ టైమ్ అంత ఉంటుందా?

దర్శకధీరుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం ఈ సినిమా విడుదల కానుంది. తారక్, చెర్రీల నటన గూస్ బంప్స్ తెప్పిస్తుందని జక్కన్న చెబుతున్నారు. అందుకే ఈ సినిమా విడుదల వరకూ అభిమానులు ఆగలేకపోతున్నారు.  ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా రన్ టైమ్ గురించి ఓ ఆసక్తికరమైన సమాచారం అందింది. అదేంటంటే.. ఈ సినిమాకి జక్కన్న దాదాపు3 గంటలు రన్ టైమ్ ఫిక్స్ చేశారట. సాధారణంగా రాజమౌళి సినిమాలకి 2 గంటల 50 నిమిషాలకు తక్కువ కాకుండా రన్ టైమ్ ఉంటుంది. ఈ సినిమాకి కూడా అదే రేంజ్ లో రన్ టైమ్ ను సెట్ చేశారట. తను అనుకున్న కథాంశం స్ర్కీన్ పై ఆవిష్కృతం అవ్వాలంటే ఆ మాత్రం నిడివి ఉండాలనేది జక్కన్న థీరీ. ఈ సినిమా ఎలాగూ విజువల్ వండర్ కాబట్టి.. అభిమానులకు అది అంతగా పట్టింపు ఉండదని ఆయన నమ్మకమట. మరి 3గంటల రన్ టైమ్ తో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఎన్ని రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి. 

Advertisement
Advertisement