Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆగి ఉన్న లారీని డీకొట్టిన కారు.. ముగ్గురి మృతి

నెల్లూరు : కావలి జాతీయ రహదారిపై రుద్రకోట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరొకరిని కావలి ఏరియా హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement
Advertisement