Sep 18 2021 @ 19:37PM

సోషల్‌ మీడియాలో మేఘా ఆకాష్‌కు క్రేజ్‌

తెలుగు, తమిళ భాషల్లో రాణిస్తున్న యువ నటీమణి మేఘా ఆకాష్‌ ‘ఎన్నై నోక్కి పాయుం తోట్టా’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌‌కు పరిచయమైంది. ఈ అందాల భామ ‘పేట’, ‘వందా రాజావాగదాన్‌ వరువేన్‌’, ‘బూమరాంగ్‌’, ‘ఒరు పక్క కథై’ వంటి చిత్రాల్లో నటించింది. అలాగే కొన్ని తెలుగు చిత్రాల్లో కూడా నటించింది. నిజానికి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘పేట’ చిత్రం ద్వారా తమిళ ఇండస్ట్రీకి నటిగా పరిచయమైంది. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించిన ‘ఎన్నై నోక్కి పాయుం తోట్టా’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ద్వారా ఆమెకు మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఆ తర్వాత హీరో శింబుతో కలిసి ‘వందా రాజావాగదాన్‌ వరువేన్‌’ చిత్రంలోనూ, అధర్వతో కలిసి ‘బూమరాంగ్‌’ వంటి చిత్రాల్లో నటించి, ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిన మేఘా ఆకాష్‌కు సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ సంఖ్య బాగానే ఉంది. ఆ కారణంగానే ఆమె ఫాలోయర్ల సంఖ్య 3 మిలియన్లకు చేరుకుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ చిన్న పార్టీని కూడా ఆమె తన ఫ్రెండ్స్‌తో కలిసి సెలెబ్రేట్‌ చేసుకుంది.