రైతులకు మూడు నెలల వడ్డీ మాఫీ

ABN , First Publish Date - 2020-05-24T08:30:50+05:30 IST

కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు ఏవిధంగా స్పందించాలో తెలియజేస్తూ ఏడు అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను ఒక మేధావుల బృందం ప్రతిపాదించింది. దీన్ని ‘మిషన్‌ జై హింద్‌’గా పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే తగిన చర్యలకు ఉపక్రమించాలని...

రైతులకు మూడు నెలల వడ్డీ మాఫీ

  • చిన్న వ్యాపారాలు, గృహ రుణాలకు కూడా 
  • 7 అంశాల కార్యాచరణ ప్రణాళిక: మేధావుల బృందం ప్రతిపాదన 


న్యూఢిల్లీ, మే 23: కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు ఏవిధంగా స్పందించాలో తెలియజేస్తూ ఏడు అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను ఒక మేధావుల బృందం ప్రతిపాదించింది. దీన్ని ‘మిషన్‌ జై హింద్‌’గా పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే తగిన చర్యలకు ఉపక్రమించాలని సూచించారు. దీనికి మద్దతిచ్చిన వారిలో ప్రముఖ ప్రొఫెసర్లు ప్రణబ్‌ బర్ధన్‌, దీపక్‌ నయ్యర్‌, జీన్‌ డ్రెజ్‌, అభిజిత్‌ సేన్‌, మైత్రీష్‌ ఘటక్‌, జయతీ ఘోష్‌, దేబ్రాజ్‌ రాయ్‌, ఆర్‌ నాగరాజ్‌, అశోక్‌ కొత్వాల్‌, సంతోష్‌ మెహ్రోత్రా, అమిత్‌ బసోలే, హీమాన్షుతోపాటు ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, సామాజిక ఉద్యమ కార్యకర్తలు హర్ష్‌ మందర్‌, నిఖిల్‌ డే, బెజవాడ విల్సన్‌ తదితరులున్నారు. లాక్‌డౌన్‌తో సామాన్యుల జీవితాలు, జీవనాధారాలు కుప్పకూలిపోయాయి. వీరికి తక్షణం ఆర్థిక మద్దతునిచ్చే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తన భారీ ఉద్దీపన ప్యాకేజీలో పట్టించుకోలేదని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర  ప్రభుత్వం అదనంగా సమకూర్చుకునే రాబడుల్లో కనీసం 50 శాతం రాష్ట్రాలకు తప్పనిసరిగా పంచాలని సూచించారు. 




1. పది రోజుల్లో వలస కూలీలను తమ స్వస్థలాలకు తీసుకురావాలి

2. కరోనా రోగులకు అన్నిచోట్ల ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలు అందించాలి

3. ఆరు నెలల పాటు ఎక్కడైనా పెంచిన రేషన్‌ పొందేలా చూడాలి

4. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరింతగా ఉపాధి హామీ క ల్పించాలి

5.ఉద్యోగం లేదా జీవనాధారం కోల్పోయిన వారికి నగదు పరిహారం ఇవ్వాలి

6. రైతులు, చిన్న వ్యాపార, గృహ రుణాలపై 3నెలల వడ్డీ మాఫీ చేయాలి

7. జాతీయ పునరుజ్జీవన మిషన్‌కు వనరుల కొరత అవరోధం కాకూడదు. పౌరుల వద్ద ఉన్న, దేశంలోని అన్ని వనరుల (నగదు, రియల్‌ ఎస్టేట్‌, ప్రాపర్టీ, బాండ్స్‌ వంటివి)ను  జాతీయ వనరులుగా పరిగణించాలి.


Updated Date - 2020-05-24T08:30:50+05:30 IST