సున్నిపెంటలో పేలుడు సామగ్రి సీజ్‌... ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2021-05-15T09:42:28+05:30 IST

కర్నూలు జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో అనుమతులు లేకుండా పేలుడు సామాగ్రిని వినియోగించిన వారిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. సున్నిపెంటలోని..

సున్నిపెంటలో పేలుడు సామగ్రి సీజ్‌... ముగ్గురి అరెస్టు

శ్రీశైలం, మే 14: కర్నూలు జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో అనుమతులు లేకుండా పేలుడు సామాగ్రిని వినియోగించిన వారిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. సున్నిపెంటలోని కృపానిలయం చర్చి వద్ద ఓవర్‌హెడ్‌ ట్యాంకు నిర్మాణానికి పునాది తవ్వేందుకు పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం ఉదయం అక్కడికి వెళ్లి తనిఖీలు చేయగా పేలుడు సామగ్రి లభ్యమైంది. తనిఖీల్లో బయటపడ్డ 150 జిలెటిన్‌ స్టిక్స్‌, 169 డిటోనేటర్లు, ఒక కంప్రెన్సర్‌ ట్రాక్టర్‌, ఒక డ్రిల్లింగ్‌ మిషన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఓవర్‌హెడ్‌ నిర్మాణ పనుల సూపర్‌వైజర్‌ పోనిశెట్టి సుబ్బారావు(తూర్పుగోదావరి జిల్లా, అచంట మండలం అయోధ్యలంక గ్రామం), ట్రాక్టర్‌ ఓనర్‌ డేరంగుల చంద్రమౌళి, ట్రాక్టర్‌ లేబర్‌ వర్రికుప్పల మల్లేష్‌ (ఇరువురిది తెలంగాణలోని అచ్చంపేట మండలం, హాజీపూర్‌ గ్రామం)ను పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2021-05-15T09:42:28+05:30 IST