ముంబై కారుబాంబు కేసు: ముగ్గురు నిందితులకు ఎన్ఐఏ కస్టడీ

ABN , First Publish Date - 2021-06-22T02:58:58+05:30 IST

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ ఇంటి ముందు కారు బాంబు నిలిపిన కేసులో, సదరు కారు యజమాని మన్సుక్...

ముంబై కారుబాంబు కేసు: ముగ్గురు నిందితులకు ఎన్ఐఏ కస్టడీ

ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ ఇంటి ముందు కారు బాంబు నిలిపిన కేసులో, సదరు కారు యజమాని మన్సుక్ హీరేన్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను ఎన్ఐఏ కస్టడీకి విధిస్తూ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరెస్ట్ అయిన ప్రదీప్ శర్మతో కలిపి ఈ ముగ్గురినీ విచారించాల్సిన అవసరం ఉందంటూ ఎన్ఐఏ కోరడంతో ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సునీల్ మనే, సంతోష్ షెలార్, ఆనంద్ జాదవ్‌లను ఈ నెల 25 వరకు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తున్నట్టు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి పీఆర్ సిత్రే ప్రకటించారు. ఈ నెల 11న అరెస్ట్ అయిన షెలార్, జాదవ్‌లు ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలోనే ఉన్నప్పటికీ... మనే ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా జూన్ 11న అరెస్ట్ అయిన శర్మ ఎన్ఐఏ కస్టడీ గడువు ఈ నెల 28 వరకు ఉంది. ముంబై మాజీ పోలీస్ అధికారుల సచిన్ వాజే, శర్మల కనుసన్నల్లోనే మన్సుక్ హీరేన్ హత్య జరిగినట్టు తమ విచారణలో షెలార్, జాదవ్ అంగీకరించినట్టు ఎన్ఐఏ ఇవాళ కోర్టుకు నివేదించింది. 

Updated Date - 2021-06-22T02:58:58+05:30 IST