పోలీస్‌ పిల్లల విదేశీ విద్యకు 30 లక్షల రుణం

ABN , First Publish Date - 2021-08-02T07:36:21+05:30 IST

రాష్ట్రంలోని పోలీస్‌ సిబ్బంది పిల్లల విదేశీ విద్యా రుణాన్ని రూ.30లక్షలకు పెంచారు.

పోలీస్‌ పిల్లల విదేశీ విద్యకు 30 లక్షల రుణం

హైదరాబాద్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పోలీస్‌ సిబ్బంది పిల్లల విదేశీ విద్యా రుణాన్ని రూ.30లక్షలకు పెంచారు. హోదాతో సంబంధం లేకుండా కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ అధికారుల పిల్లలు ఈ రుణాన్ని తీసుకోవచ్చు. గతంలో విదేశీ విద్యా రుణాన్ని ట్యూషన్‌ ఫీజు కింద రూ.15 లక్షలే ఇచ్చేవారు. ప్రస్తుతం ట్యూషన్‌ ఫీజుతోపాటు ఇతర ఖర్చుల కోసం రూ.30 లక్షల రుణం తీసుకునే అవకాశం కల్పించారు. జూన్‌ 8న జరిగిన భద్రత, ఆరోగ్య భద్రత ట్రస్ట్‌ బోర్డు సమావేశంలోనే విదేశీ విద్యా రుణాన్ని రూ.30 లక్షలకు పెంచాలని డీజీపీ మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. ఈ పెంపు జూన్‌ 1 నుంచే అమల్లోకి వస్తుందని ఆదివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పోలీసులు వినియోగించుకోవాలని సూచించారు.

Updated Date - 2021-08-02T07:36:21+05:30 IST