Abn logo
Apr 7 2020 @ 06:22AM

జిల్లాలో 30 పునరావాస కేంద్రాలు: డీఎఫ్‌వో

శృంగవరపుకోట ఏప్రిల్‌ 6:వలస కుటుంబాల సంరక్షణకు జిల్లాలో 30 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా అటవీ శాఖ అధికారి, పునరావాస కేంద్రాల జిల్లా ఇన్‌చార్జి లక్ష్మణ్‌ తెలిపారు. సోమవారం శృంగవరపుకోట ఆకులడిపో వద్ద వున్న మధ్యప్రదేశ్‌ నుంచి జిల్లాకు పనుల నిమిత్తం వచ్చిన వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 200 కేజీల గోధుమ పిండి, 50కేజీల ఉల్లిపాయలు, 15కేజీల నూనె డబ్బాను మంగళపాలెంనకు చెందిన గురుదేవ చారిటబుల్‌ ట్రస్టు నిర్వాహకుడు రాపర్తి జగదీష్‌బాబు, పాలు, కందిపప్పు ప్యాకెట్లను తహసీల్దార్‌ రామా రావులు సమకూర్చారు.


వీటిని పునరావాస కేంద్రాల్లోని వలస కుటుంబా లకు అందజేశారు. కార్యక్రమంలో ఉపతహసీల్దార్‌ హరి పాల్గొన్నారు. అలాగే టీడీపీ నాయకుడు చెక్క కిరణ్‌ అందించిన నిత్యావసర వస్తువులను చింతబడి గ్రామంలోని 80 పేద కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, పార్టీ అధ్యక్షుడు జీఎస్‌నాయుడు, కొణదం మల్లేశ్వరరావు, కాపుగంటి వాసు, అనకాపల్లి చెల్లయ్య, బర్మాకాలని సాయి తదితరులు పాల్గొన్నారు. పారి శుధ్య కార్మికులకు స్నేహ స్వచంద సంస్థ అందించిన గ్లౌజులను  సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ నీలకంఠంలు పంపిణీ చేశారు.


కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఎం.సుబ్బారావు, బుగల వెంకటేశ్వరరావు, పొట్నూరు శ్రీరాములు పాల్గొన్నారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నాయకుడు సూర్యారావు, దాశరథిలో ఎస్సీ కాలనీలో ఉన్న సాయి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు అందజేశారు.

Advertisement
Advertisement
Advertisement