Abn logo
Sep 25 2020 @ 11:18AM

ఓటీటీలో '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'

Kaakateeya

పాపులర్‌ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు హీరోగా మున్నా దర్శకత్వంలో ఎస్‌.వి.బాబు నిర్మించిన చిత్రం  '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. ఉగాది సందర్భంగా మార్చి 25న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌ భావించారు. కానీ.. కోవిడ్‌ ఎఫెక్ట్‌తో థియేటర్స్‌ మూత పడటంతో సినిమా విడుదల ఆగింది. సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయాలని భావించిన చిత్ర యూనిట్‌ ఇన్నిరోజులు వెయిట్‌ చేసింది.  కానీ థియేటర్స్‌ ఓపెనింగ్‌ విషయంలో ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఎట్టకేలకు  '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇప్పటికే నాని 'వి' ఓటీటీలోనే విడుదలైంది. అలాగే అనుష్క 'నిశ్శబ్దం' సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఇంకా మరికొన్ని చిత్రాలు కూడా ఓటీటీల్లో రిలీజ్‌ కావడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో ఆ చిత్రాల బాటలోనే  '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' కూడా ఓటీటీలోనే విడుదల కానుందని అంటున్నారు. ప్రముఖ డిజిటల్‌ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ ఈ చిత్రాన్ని విడుదల చేయనుందని, త్వరలోనే అధికారిక సమాచారం రానుందని టాక్‌ వినిపిస్తోంది. 


Advertisement
Advertisement
Advertisement