యూపీఎస్సీ ఇంటర్వ్యూలో విఫలం... యువతి, యువకుడు ఆత్మహత్య!

ABN , First Publish Date - 2021-08-07T12:53:39+05:30 IST

జీవితంలో తీవ్రమైన వైఫల్యం ఎదురైనపుడు...

యూపీఎస్సీ ఇంటర్వ్యూలో విఫలం... యువతి, యువకుడు ఆత్మహత్య!

చండీగఢ్: జీవితంలో తీవ్రమైన వైఫల్యం ఎదురైనపుడు కొందరు ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు క్షణికావేశంలో ఆత్మహత్యను ఆశ్రయిస్తుంటారు. ఇటువంటి ఘటన చండీగఢ్ సెక్టార్ 37, 38లలో చోటుచేసుకుంది. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఇద్దరు అభ్యర్థులు నాలుగు గంటల వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో వీరిద్దరికీ యూపీఎస్సీ పరీక్షకు హాజరయ్యేందుకు ఇదే చివరి అవకాశమని తెలిసింది. 


హరియాణాలోని సోనీపత్ నివాసి అంకిత్ చహల్(30), సెక్టార్-38 నివాసి సిమ్రన్(29) యూపీఎస్సీ ఇంటర్వ్యూలో విఫలమయ్యారు. ఈ కారణంగానే వారు ఆత్మచేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ ఈ ప్రాంతంలో ఉంటూ యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు ఘటనల మధ్య సంబంధం లేకపోయినప్పటికీ యూపీఎస్సీ పరీక్షల్లో వైఫల్యమే వీరి ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-07T12:53:39+05:30 IST