Advertisement
Advertisement
Abn logo
Advertisement

యూఏఈ-భారత్ మధ్య 300 విమానాలు రాకపోకలు!

అబుధాబి: కొవిడ్ నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు దాదాపు ఒక మిలియన్ మందికిపైగా భారతీయులు యూఏఈని వీడి స్వదేశానికి చేరుకున్నారని యూఏఈలోని భారత అంబాసిడర్ అన్నారు. అయితే ఇందులో చాలా మంది తిరిగి యూఏకీ వచ్చినట్టు పేర్కొన్నారు. యూఏఈకి చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో భారత అంబాసిడర్ పవన్ కపూర్ పలు అంశాలపై మాట్లాడారు. 2020 ఫిబ్రవరిలో యూఏఈలో కరోనా వైరస్ విజృంభణ మొదలైన తర్వాత.. మహమ్మారి ప్రభావానికి లోనైన, మానసికంగా కుంగిపోయిన భారతీయులను చేరుకోవడం కష్టతరం అయిందన్నారు. అయితే ఆ పరిస్థితులను ఛాలెంజ్‌గా తీసుకుని దుబాయిలోని కాన్సులేట్ కార్యాలయం, యూఏఈ అధికారుల సహకారంతో కొవిడ్ కారణంగా ఇబ్బందులకు గురైన ప్రవాసులను చేరినట్టు చెప్పారు. హాట్‌లైన్, 24/7 ఈమెయిల్ సర్వీసుల భారతీయులకు అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించారు. అవసరం అయిన వారికి ఆన్‌లైన్ ద్వారా మెడికల్ కౌన్సెలింగ్‌‌ను అందించినట్టు చెప్పారు. 


అంతేకాకుండా ఆహార, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మహమ్మారి విజృంభణ నేపథ్యంలో భారత్-యూఏఈల మధ్య రాకపోకలు నిలిచిపోయాయని.. అయితే మే7న భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్‌ను ప్రారంభించిందని గుర్తు చేశారు. ఈ మిషన్ ద్వారా మూడు నెలలలోపే సుమారు 3లక్షల మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్టు చెప్పారు. ఆ తర్వాత ఈ సంఖ్య మిలియన్‌కు చేరిందన్నారు. కరోనా సమయంలో స్వదేశానికి చేరిన చాలా మంది భారతీయులు తిరిగి యూఏఈకి కూడా వచ్చినట్టు పేర్కొన్నారు. జూలైలో యూఏఈతో భారత ప్రభుత్వం ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మధ్య వారానికి 300 విమానాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement