రాష్ర్టాలకు 31.80 టన్నుల ఆహారధాన్యాలు

ABN , First Publish Date - 2021-05-19T08:01:14+05:30 IST

కరోనా విజృంభణ నేపథ్యంలో రా ష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మే నెలకు సంబంధించి 31.80 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ శాఖ వెల్లడించింది

రాష్ర్టాలకు 31.80 టన్నుల ఆహారధాన్యాలు

జాబితాలో ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాలు 


న్యూఢిల్లీ, మే 18 (ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభణ నేపథ్యంలో రా ష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మే నెలకు సంబంధించి 31.80 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ శాఖ వెల్లడించింది. పేద ప్రజల ఆర్థిక దుస్థితిని పరిగణనలోకి తీసుకుని ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన(పీఎంజీకేఏవై) కింద వీటిని అందిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం కేంద్రం రూ.26వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది. ఆహారధాన్యాలను ఉచితంగా అందుకోనున్న 15 రాష్ర్టాల్లో ఏపీ, తెలంగాణ, అండమాన్‌ నికోబార్‌ దీవులు, అరుణాచల్‌ప్రదేశ్‌, గోవా, ఛత్తీ్‌సఘఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, లద్ధాఖ్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌ పుదుచ్చేరి, తమిళనాడు, త్రిపురలకు ఉన్నట్లు వివరించింది. ఈ పథకం కింద ఒక్కో పేద కుటుంబానికి5కిలోల ఆహారధాన్యాలు పంపిణీ చేస్తారు. దీంతో మొత్తం 79.39కోట్ల మంది లబ్ధిపొందనున్నారు. పేదలకు ప్రతినెలా పంపిణీ చేస్తున్న ఆహారధాన్యాలకు ఇది అదనమని కేంద్రం పేర్కొంది. 

Updated Date - 2021-05-19T08:01:14+05:30 IST