31 వరకు రాత్రి కర్ఫ్యూ

ABN , First Publish Date - 2022-01-01T14:03:58+05:30 IST

కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరిలో జనవరి 31 వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, తాజాగా ‘ఒమైక్రాన్‌’ కేసులు

31 వరకు రాత్రి కర్ఫ్యూ

పుదుచ్చేరి: కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరిలో జనవరి 31 వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, తాజాగా ‘ఒమైక్రాన్‌’ కేసులు బయటపడటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతిరోజూ రాత్రి 11 నుంచి వేకువజామున 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పుదుచ్చేరిలో ఆంగ్ల సంవత్సరాది వేడుకలను శుక్రవారం రాత్రి 12.30 గంటల వరకు జరుపుకునేందుకు అనుమతిచ్చినట్లు పేర్కొంది. తర్వాత పుదుచ్చేరి బీచ్‌లో జనసంచారంపై నిషేధం అమలు చేస్తామని, వేకువజాము 2 గంటల తర్వాత ప్రజలు సంచరించకూడదని అధికారులు వివరించారు. బీచ్‌రోడ్డు, ఉద్యానవనాల్లో రాత్రి పూట కర్ఫ్యూ సమయాల్లో మినహా మిగిలిన సమయాల్లో ప్రజలు సందర్శనకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. 


వైకుంఠ ఏకాదశికి మినహాయింపు...

జనవరి 13న వైకుంఠ ఏకాదశి రోజున రాత్రిపూట కర్ఫ్యూ నుంచి మిన హాయింపు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ రోజు ఆలయాలకు వెళ్లేందుకు భక్తులకు అనుమతిస్తున్నామన్నారు. ఏకాదశి రోజు రాత్రి 10 గంటల తర్వాత కూడా హిందూ దేవాలయాలను తెరుచుకోవచ్చని స్పష్టం చేశారు.



Updated Date - 2022-01-01T14:03:58+05:30 IST