25న బంద్‌కు 31 రైతు సంఘాల మద్దతు

ABN , First Publish Date - 2020-09-23T22:04:40+05:30 IST

పార్లమెంట్‌లోని రెండు సభల్లో మూడు బిల్లులు ఆమోదం పొందిన వెంటనే సోషల్ మీడియాలో బంద్‌లకు పలువురు పిలుపునిచ్చారు. ఈ బిల్లులపై మొదటి నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పంజాబ్ రైతులే తొలి బంద్‌కు అధికారికంగా పిలుపునిచ్చారు.

25న బంద్‌కు 31 రైతు సంఘాల మద్దతు

న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈ నెల 25న పంజాబ్‌ బంద్‌కు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ పంజాబ్ శాఖ పిలుపునిచ్చింది. కాగా దీనికి 31 రైతు సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఇదే విషయమై సోషల్ మీడియాలో సైతం పెద్ద చర్చ జరుగుతోంది. నెటిజెన్లు సైతం వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నారు.

ఈ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా మొదటగా ఉద్యమం ప్రారంభించింది పంజాబ్ రైతులే. పంజాబ్‌లో అనంతరం హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ రైతులు ఈ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ నిరసనలు ప్రారంభించారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో సైతం రైతులు ఉద్యమం చేపట్టారు. కాగా పార్లమెంట్‌లో మూడు వ్యవసాయ బిల్లులు ప్రవేశ పెట్టిన సందర్భంలో కూడా పంజాబ్‌ నుంచే ఎక్కువగా వ్యతిరేకత వచ్చింది.

పార్లమెంట్‌లోని రెండు సభల్లో మూడు బిల్లులు ఆమోదం పొందిన వెంటనే సోషల్ మీడియాలో బంద్‌లకు పలువురు పిలుపునిచ్చారు. ఈ బిల్లులపై మొదటి నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పంజాబ్ రైతులే తొలి బంద్‌కు అధికారికంగా పిలుపునిచ్చారు.

Updated Date - 2020-09-23T22:04:40+05:30 IST