32,238 మంది పారామిలిటరీ సిబ్బందికి కరోనా: కేంద్రం

ABN , First Publish Date - 2020-09-21T00:22:08+05:30 IST

32,238 మంది పారామిలిటరీ సిబ్బందికి కరోనా: కేంద్రం

32,238 మంది పారామిలిటరీ సిబ్బందికి కరోనా: కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజురోజుకూ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మొత్తం 32,238 మంది పారామిలిటరీ సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం ఆదివారం తెలిపింది. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 9,158 మంది సిబ్బంది, బీఎస్‌ఎఫ్‌కు చెందిన 8,934 మంది సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన 5,544 మంది సిబ్బంది, ఐటీబీపీకి చెందిన 3,380 మంది సిబ్బంది, ఎస్‌ఎస్‌బీకి చెందిన 3,251 మంది సిబ్బంది, అస్సాం రైఫిల్స్‌కు చెందిన 1,746 మంది సిబ్బంది, ఎన్‌ఎస్‌జీకి చెందిన 225 మంది సిబ్బందికి ఈ వైరస్ సోకిందని లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు.


కరోనా సోకిన వారిలో అత్యధిక రికవరీ రేటు సీఆర్పీఎఫ్ (84.4శాతం)లో నమోదైంది. తరువాత బీఎస్ఎఫ్ (80.41శాతం) మరియు సీఐఎస్ఏఫ్ (75.25 శాతం) ఉన్నాయి. సీఐఎస్ఎఫ్ (0.43శాతం)లో అత్యధిక మరణాల రేటు నమోదైందని, తరువాత అస్సాం రైఫిల్స్ (0.40శాతం) సీఆర్పీఎఫ్ (0.39శాతం) నమోదైందని రాయ్ చెప్పారు.

Updated Date - 2020-09-21T00:22:08+05:30 IST