Abn logo
Sep 22 2021 @ 00:52AM

33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

సిరిసిల్లలో మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత

సిరిసిల్ల రూరల్‌, సెప్టెంబరు 21:చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని, దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నా రులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేం దుకు ప్రతీ జిల్లాలో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణం లోని నెహ్రూనగర్‌లోని ఆర్‌ఎంపీ భవనంలో మంగళవారం ఐద్వా జిల్లా ప్రఽథమ మహాసభ ను జిల్లా అధ్యక్షురాలు సూరం పద్మ, కార్యదర్శి జివ్వాజి విమల ఆఽధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అఽశాలత మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. మహిళలు, చిన్నా రులపై అత్యాచారాలు, హత్యలు నిరంతరం కొనసాగు తున్నాయన్నారు. వీటిని అరికట్టుడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి పార్లమెంట్‌లో బిల్లు పెట్టకుండా దాటవేసే ధోరణి కొనసాగుతోందన్నారు. దేశంలో రోజు రోజుకు నిత్యా వసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని, దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  కరోనాతో దేశ వ్యాప్తంగా కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని, కార్మికులను ఆదు కునేందకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. ప్రతీ కుటుం బానికి రూ.7వేల 500 నగదుతోపాటు 14 రకాల నిత్యావసరాలను ఉచితంగా అందించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.  

 ఐద్వా జిల్లా కమిటీ

 జిల్లా ఐద్వా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు రాష్ట్ర అఽధ్యక్షురాలు అశాలత ప్రక టించారు.  అధ్యక్షురాలిగా సూరం పద్మ, కార్య దర్శిగా జివ్వాజి విమల, ఉపాధ్యక్షులుగా పప్పు రామలక్ష్మి, గట్ల స్వప్న, సహాయ కార్యదర్శులుగా జక్కని త్రివేంద్ర, మాతంగి వసంత, రజిత, గౌరు రాజేశ్వరి, నాగమణి, సులోచన, వడ్ల లక్ష్మి, హేమలత, గౌరు కవిత, సోనీ ఎన్నికయ్యారు.