Kuwait లో ప్రవాస వైద్య సిబ్బంది మొత్తం ఎంతమందంటే..

ABN , First Publish Date - 2021-10-29T19:59:38+05:30 IST

కువైత్‌లోని దాదాపు అన్ని రంగాల్లో వలసదారులు అధిక సంఖ్యలో ఉపాధి పొందుతున్న సంగతి తెలిసిందే.

Kuwait లో ప్రవాస వైద్య సిబ్బంది మొత్తం ఎంతమందంటే..

కువైత్ సిటీ: కువైత్‌లోని దాదాపు అన్ని రంగాల్లో ప్రవాసులు అధిక సంఖ్యలో ఉపాధి పొందుతున్న సంగతి తెలిసిందే. దీనికి వైద్యరంగం కూడా మినహాయింపు కాదు. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం ఆ దేశ ఆరోగ్యశాఖలో ప్రవాస వైద్య సిబ్బంది భారీ సంఖ్యలో ఉన్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం ఆ దేశ ఆరోగ్యశాఖలో 61,353 మంది వైద్య సిబ్బంది ఉంటే.. అందులో 33,074 మంది ప్రవాసులు, 28,279 మంది కువైటీలు ఉన్నారు. ఇక 33,074 మందిలో 9,762 మంది డాక్టర్లు, 2,298 డెంస్టిలు, 21,490 నర్సింగ్ స్టాఫ్, 1,667 ఫార్మాసిస్టులు, 385 అసిస్టెంట్ టెక్నికల్ సిబ్బంది, 11,585 అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్, 2,893 నాన్-మెడికల్ టెక్నికల్ స్టాప్, 10,321 మెడికల్ టెక్నికల్ సిబ్బంది, మరో 347 మంది ఎలుకల నియంత్రణ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారు. ఇలా మొత్తం 33,074 మంది విదేశీ మెడికల్ స్టాప్ కువైత్ ఆరోగ్యశాఖలో పని చేస్తోంది.           

Updated Date - 2021-10-29T19:59:38+05:30 IST