జేమ్స్‌ బాండ్ అంటే భర్తకు పిచ్చి! భార్యకు ఊహించని షాక్!

ABN , First Publish Date - 2020-07-15T00:39:36+05:30 IST

సినిమాలంటే చెవికోసుకుంటాడు..మనకు తరచూ వినబడే మాట ఇది. చెవులు, ముక్కూ ఎవరూ కోసుసేకోనప్పటికీ సినిమాలంటే పట్టలేనంత ఇష్టం అని చెప్పేందుకు ఈ వాక్యం చక్కగా సరిపోతుంది.

జేమ్స్‌ బాండ్ అంటే భర్తకు పిచ్చి! భార్యకు ఊహించని షాక్!

న్యూఢిల్లీ: సినిమాలంటే చెవికోసుకుంటాడు..మనకు తరచూ వినబడే మాట ఇది. అయితే ఇలా నిజనీవితంలో చెవులు, ముక్కూ కోసుకునే వారెవరూ ఉండనప్పటికీ  ‘సినిమాలంటే పట్టలేనంత ఇష్టం’ అని చెప్పేందుకు ఈ వాక్యం చక్కగా సరిపోతుంది. అయితే ఢిల్లీకి చెందిన వికాస్ కందమ్ గురించి తెలిస్తే మాత్రం సినిమాలంటే పేరు మార్చుకుంటాడు అనే కొత్త వాక్య ప్రయోగం పాపులర్ కాక మానదు. అంతటీ గొప్ప స్టోరీ మనోడిది.


ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. సదరు వికాస్‌కు జేమ్ బాండ్ సినిమాలన్నా, ఆ పాత్ర అన్నా చచ్చేంత పిచ్చి. దీంతో అతడు తల్లిదండ్రులు తనకు నిక్షేపంగా పెట్టిన పేరును కూడా కాదనుకుని జేమ్స్ బాండ్‌గా తన పేరును మార్చుకున్నాడు. అదీ అధికారికంగా.. రికార్డుల్లో ఈ మార్పును సుస్థిరం చేశాడు. ముడు నెలల క్రితం..కట్టుకున్న భార్యకు కూడా చెప్పా పెట్టకుండా గప్‌చుప్‌గా పనికానిచ్చేశాడు. స్నేహితులకు ఈ నిర్ణయం గురించి తెలిసినప్పటకీ అతడి మొండి పట్టు చూసి ఏంచేయలేక సైలెంట్ అయిపోయారు.


అయితే ఇటీవల ఓ శుభముహుర్తాన ఇంట్లో భార్య చెవున పేరు మార్పు గురించి వికాస్..సారి జేమ్స్ బాండ్ బయటపెట్టేశాడు. ఇలా ఉన్నట్టుంది మగడిచ్చిన షాక్‌తో పాపం.. ఆ మహా ఇల్లాలికి నోట మాట లేకుండా అయిపోయింది. నలుగురిలో తన పరువు తీసేశాడని తిక్కరేగిన ఆమె రెండు రోజుల నుంచి అతడితో మాటపలుకూ బంద్ చేసేసింది. ఇక తల్లిదండ్రులపై కూడా సమయం చూసి ఈ బాంబ్ పేల్చాలని అతగాడు ఎదురు చూస్తున్నాడు. ఇంతకీ ఎందుకయ్యా..ఇంతటీ నిర్ణయం తీసుకున్నావు అని స్థానిక మీడియా అడగ్గా..నాది, జేమ్స్‌దీ ఓకటే టైపు పర్సనాటీ అందుకే ఇలా డిసైడయ్యా.. అని గర్వంగా ప్రకటించాడు. పేరు ఎలాగూ మారిపోయింది కాబట్టి..ఇక పాన్, ఆధార్ కార్డులపై కూడా తగు మార్పులు చేయాలని మనోడు రెడీ అయిపోతున్నాడు. అద్గదీ.. మనోడి పేరు మార్పు వెనకాలున్న గొప్ప స్టోరీ.

Updated Date - 2020-07-15T00:39:36+05:30 IST