Abn logo
Aug 5 2020 @ 03:36AM

‘సివిల్స్‌’లో మెరిసిన మనోళ్లు

  • తెలుగు రాష్ట్రాల నుంచి 34 మంది ఎంపిక
  • గుంటూరు అభ్యర్థికి రాష్ట్రస్థాయిలో ప్రథమం
  • 76వ ర్యాంకు సాధించిన సూర్యతేజ
  • కడపలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, 
  • కర్నూలు జిల్లాలో ఇద్దరు, విశాఖ, 
  • అనంతల్లో ఒక్కొక్కరికి ర్యాంకులు
  • తొలి ప్రయత్నంలోనే కర్నూలు వాసికి చాన్స్‌
  • ఐపీఎస్‌ శిక్షణ నుంచి ఐఏఎ్‌సకు మరొకరు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 34 మంది సత్తా చాటారు. మంచి ర్యాంకులు సాధించారు. కొందరు పట్టువదలని విక్రమార్కులను తలపించేలా కష్టించి అఖిలభారత సర్వీసులకు ఎంపికకాగా, కర్నూలుకు చెందిన సమీర్‌రాజా(603) మాత్రం తొలి ప్రయత్నంలోనే తన కలను సాకారం చేసుకున్నారు. సివిల్స్‌కు ఎంపికైన వారిలో కడప జిల్లా నుంచి ముగ్గురు, కర్నూలు నుంచి ఇద్దరు, గుంటూరు నుంచి ఇద్దరు, విశాఖ, అనంతపురం జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఈ మేరకు యూపీఎ్‌ససీ మంగళవారం 2019 సివిల్స్‌ ఫలితాలను విడుదల చేసింది. కాగా, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన సూర్యతేజ ఐదో ప్రయత్నంలో 76వ ర్యాంకుతో సివిల్‌ సర్వీ్‌సకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో ప్రథమర్యాంకు ఇదేకావడం విశేషం. సివిల్‌ సర్వీ్‌సకు దేశ వ్యాప్తంగా 829 మంది ఎంపిక కాగా.. హరియాణాకు చెందిన ప్రదీప్‌ సింగ్‌ తొలిస్థానం, జతిన్‌ కిశోర్‌(ఢిల్లీ) ద్వితీయ, ప్రతిభా వర్మ(యూపీ) తృతీయ స్థానాల్లో నిలిచారు. 


రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్‌కు ఎంపికైన వారు, ర్యాంకులు..

మల్లవరపు సూర్యతేజ(76), సింగారెడ్డి రుషికేశ్‌ రెడ్డి(95), గొరిజాల మోహన్‌ కృష్ణ(283), జంగం కులదీప్‌(135), సి. సమీర్‌రాజా(603), సి. చైతన్య కుమార్‌రెడ్డి(250), బచ్చు ధీరజ్‌ కుమార్‌(768), తాటి మాకుల రాహుల్‌ కుమార్‌ రెడ్డి(117), చీమల శివగోపాల్‌రెడ్డి(263), పెద్దిటి ధాత్రిరెడ్డి(46), కట్టా రవితేజ(77), విశాల్‌ తేజ్‌రాజ్‌ నర్వది(91), ఎంవీ సత్యసాయి కార్తీక్‌(103), కె.ప్రేమసాగర్‌(170), బి.రాహుల్‌(272), వి.తేజదీపక్‌(279), ఎ.వెంకటేశ్వరరెడ్డి(314), ముత్తినేని సాయితేజ(344), రేణుకుంట శీతల్‌ కుమార్‌(417), ముక్కెర లక్ష్మీ పావన గాయత్రి(427), కొల్లాబత్తుల కార్తీక్‌(428), ఎన్‌.వివేక్‌ రెడ్డి(485), నీతిపూడి రష్మితారావు(534), కోరుకొండ సిద్దార్థ(566), సుసాన్‌ బ్లెస్సీ బక్కి(585), చిలుముల రజనీకాంత్‌(598), కొప్పిశెట్టి కిరణ్మయి(633), పోలుమతి శరణ్య(653), దీపక్‌ సింగ్‌(686), డి.రమేశ్‌(690), పలని ఫణికిరణ్‌ ఎస్‌.(698), బుక్యా నరసింహస్వామి(741), కె.శశికాంత్‌ (764), రవికుమార్‌ మీనా(793) ఉన్నారు.


లక్షల వేతనాన్ని వదులుకుని

మాది గుంటూరు జిల్లా. సివిల్స్‌లో నాలుగో ప్రయత్నం లో 283వ ర్యాంకు సాధించాను.  తల్లిదండ్రుల ప్రో త్సాహంతో కృషి ఫలించింది. అయితే, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, టీసీఎస్‌ వంటి పెద్ద పెద్ద కంపెనీల్లో వచ్చిన ఉద్యోగాలను, లక్షల వేతనాన్ని వదులుకుని ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో మూడున్నరేళ్లు కష్టపడి సివిల్స్‌కు ఎంపికయ్యా.

గొరిజాల మోహన్‌కృష్ణ


వరుస విజయాలు

మాది కర్నూలు జిల్లా లక్ష్మీపురం. తల్లిదండ్రులు కష్టపడి పెంచారు. వారి ప్రోత్సాహంతోనే ఉన్నస్థాయికి ఎదగాలని నిర్ణయించుకున్నాను. సివిల్స్‌లో వరుసగా రెండేళ్లు ర్యాంకు సాధించాను. 2018లో 479వ ర్యాంకు సాధించి ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఐపీఎస్‌ ట్రైనింగ్‌లో ఉన్నా. తాజా ఫలితాల్లో 135వ ర్యాంకు సాధించాను. చాలా సంతోషంగా ఉంది.

కులదీ్‌ప 

తొలి ప్రయత్నంలోనే విజయం

మాది కర్నూలు జిల్లా ఆదోని. తొలి ప్రయత్నంలో 603వ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నన్ను ఐపీఎ్‌సగా చూడాలన్న మా తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చబోతున్నా. నేను కన్న కలలు ఈ రోజు సాకారమయ్యాయి. చిన్నప్పట్నుంచీ ఐఏఎస్‌ అవ్వాలన్నదే నా కోరిక. తల్లిదండ్రులు మాత్రం ఐపీఎ్‌సగా చూడాలని ఆశపడుతున్నారు.  చివరికి నా కల నెరవేరింది.

సమీర్‌ రాజా 

ఐఎ్‌ఫఎ్‌సగా ఉంటూ.. 

మాది అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోని దిగువగంగంపల్లి. సివిల్స్‌ ఫలితాల్లో 250వ ర్యాంక్‌ సాధించాను. వాస్తవానికి 2018లో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో 42వ ర్యాంక్‌ సాధించాను. దీంతో ఇటీవల అనంతపురం ట్రైనీ ఐఎ్‌ఫఎస్‌ అధికారిగా పోస్టింగ్‌ వచ్చింది. జిల్లా కొవిడ్‌-19 స్పెషల్‌ ఆఫీసర్‌గా ఉన్నాను. సివిల్స్‌ ర్యాంకురావడం సంతోషంగా ఉంది. 

-చైతన్యకుమార్‌రెడి ్డ

కోచింగ్‌ లేకుండానే..

మాది విశాఖపట్నం. ఇంజనీరింగ్‌ తర్వాత కొంతకాలంపాటు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేశా. ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలంటే కలెక్టర్‌ అయితేనే సాధ్యమన్న ఉద్దేశంతో 2018లో ఉద్యోగాన్ని వదిలేసి, సివిల్స్‌కు సన్నద్ధమయ్యా. ప్రత్యేకంగా కోచింగ్‌ ఏమీ తీసుకోకుండా ఇంట్లోనే ఉండి, ఇంటర్నెట్‌లోని సమాచారం ఆధారంగా సివిల్స్‌కు సిద్ధమయ్యా. రెండో ప్రయత్నంలో 320 ర్యాంకు సాధించా. 

-కూనిబిల్లి ధీరజ్‌ 

పట్టుసడలని ప్రయత్నం..

మాది కడపజిల్లా నందిమండలం గ్రామం, పెండ్లిమర్రి మండలం. మాది వ్యవసాయ కుటుంబం. మొత్తం ఆరుసార్లు సివిల్స్‌ రాశా. చివరి ప్రయత్నంలో 117వ ర్యాంకు వచ్చింది. జనరల్‌ స్టడీ్‌సకు కోచింగ్‌ తీసుకోకుండా ఆప్షనల్స్‌కు మాత్రం ఢిల్లీలోని ఓ కోచింగ్‌ సెంటరులో కోచింగ్‌ తీసుకున్నా. 

-తాటిమాకుల రాహుల్‌కుమార్‌రెడ్డి 

అమ్మానాన్నల ప్రోత్సాహమే..

మాది కడప జిల్లా మైదుకూరు. ఢిల్లీలో కోచింగ్‌ తీసుకున్నా. రెండో ప్రయత్నంలో సివిల్స్‌ సాధించాను. 263వ ర్యాంకు వచ్చింది. 10వ తరగతి వరకు శెట్టివారిపల్లె జడ్పీ హైస్కూల్‌లో చదివాను. 2012 ఇడుపులపాయ త్రిపుల్‌ ఐటీలో సీటు సంపాదించా. మా అమ్మానాన్న నమ్మకమే నాలో స్ఫూర్తి నింపింది.

-చీమల శివగోపాల్‌రెడ్డి 


ఆంధ్రజ్యోతి చదివేవాడిని

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి మా గ్రామం. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే సివిల్స్‌కు ఎంపికయ్యాను. విద్యార్థి దశ నుంచి ఆంధ్రజ్యోతి పత్రికను చదివి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాను. ఆలిండియా స్థాయిలో 76వ ర్యాం కు, రాష్ట్రస్థాయిలో 1వ స్థానం సాధించడం సంతోషం గా ఉంది. గుంటూరు విజ్ఞాన్‌ హైస్కూల్‌లో, బిటెక్‌ విశాఖ గీతం విద్యాసంస్థల్లో పూర్తి చేశాను. టీసీఎ్‌సలో ఉద్యోగం చేస్తూ సివిల్స్‌ రాశాను. ఐదో ప్రయత్నంలో 76వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. -మల్లవరపు సూర్యతేజ

నాలుగో ప్రయత్నంలో 95వ ర్యాంకు

మాది కడప జిల్లా వేంపల్లె. తొలిసారి 2015లో మెయిన్స్‌ పాస్‌ అయ్యారు. ఇంటర్వ్ల్యూలో పోయింది. రెండోసారి 2016లో మెయిన్స్‌లో పోయింది. మూడోసారి 2017లో ఐఆర్‌టీఎ్‌సకు ఎంపికయ్యారు. ప్రస్తుతం నాలుగోసారి రాసి 95వ ర్యాంకు సాధించి ఐఏఎ్‌సకు ఎంపికయ్యారు. చాలా ఆనందంగా ఉంది

-సింగారెడ్డి రుషికేశవరెడ్డి  

==================


Advertisement
Advertisement
Advertisement