that bullet speed will be 350 kilometres

ABN , First Publish Date - 2022-04-16T00:59:23+05:30 IST

the speed of that bulles is 350 the bullet speed is 350 kilometres

that bullet speed will be 350 kilometres

ముంబై : ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ట్రయల్స్ గంటకు 350 కిమీ వేగంతో నిర్వహించనున్నారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మొదటి ట్రయల్ రన్‌ను మరో నాలుగేళ్ళలో(2026 లో) గుజరాత్‌లోని బిలిమోరా, సూరత్ మధ్య నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇతర స్ట్రెచ్‌లు ఉంటాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్... భారత్ మొట్టమొదటి బుల్లెట్ రైలు సంబంధిత  ట్రయల్స్‌ను విమానాల టేకాఫ్ వేగంతో పోల్చదగిన 350 కేఎంపీహెచ్ వేగంతో నిర్వహించనున్నారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు తొలి  ట్రయల్ రన్ 2026 సంవత్సరంలో గుజరాత్‌లోని బిలిమోరా- సూరత్ మధ్య నిర్వహించనున్నారు. ఆ తరువాత ఇతర విస్తరణలు జరుగుతాయని అధికారులు ఓ నివేదికలో పేర్కొన్నారు. ఈ హైస్పీడ్ రైళ్ల నిర్వహణ వేగం గంటకు 320 కి.మీ. ఈ ప్రాజెక్ట్ ప్రయాణీకులకు గేమ్‌ఛేంజర్‌గా ఉంటుందని, విమాన ప్రయాణానికి పోటీగా ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కింద నర్మదా నదిపై అల్లకల్లోలమైన గాలులు,  అలలను భరించే అతి పొడవైన వంతెన జూలై 2024 నాటికి పూర్తికానుందని అంచనా. బుల్లెట్ రైలు కారిడార్ మొత్తం పొడవు 508.17 కిలోమీటర్లు. అహ్మదాబాద్-ముంబై నగరాల మధ్య ప్రయాణ సమయం 2.58 గంటలు. 

Updated Date - 2022-04-16T00:59:23+05:30 IST