17 రాష్ట్రాల్లో 358 ఒమైక్రాన్ కేసులు.. కోలుకున్నవారి సంఖ్యా ఎక్కువే!

ABN , First Publish Date - 2021-12-24T23:29:37+05:30 IST

దేశంలోని 17 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 358 ఒమైక్రాన్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాక కార్యదర్శి

17 రాష్ట్రాల్లో 358 ఒమైక్రాన్ కేసులు.. కోలుకున్నవారి సంఖ్యా ఎక్కువే!

న్యూఢిల్లీ: దేశంలోని 17 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 358 ఒమైక్రాన్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. వీరిలో 117 మంది కోలుకున్నట్టు చెప్పారు. బాధితుల్లో 121 మందికి విదేశీ ప్రయాణాల చరిత్ర ఉన్నట్టు తెలిపారు. 44 మందికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదని పేర్కొన్నారు. అయితే, ఒమైక్రాన్ బారినపడిన మరో 18 మందికి సంబంధించిన వివరాలు మాత్రం అందుబాటులో లేవని తెలిపారు.


మొత్తం ఒమిక్రాన్ బాధితుల్లో  87 మంది పూర్తిగా వ్యాక్సిన్లు తీసుకున్నట్టు రాజేశ్ భూషణ్ తెలిపారు. ఇద్దరు మాత్రం ఒక్క డోసు మాత్రమే తీసుకోగా, ఏడుగురు అసలు టీకాలే తీసుకోలేదని చెప్పారు. అలాగే, 70 శాతం మంది బాధితుల్లో ఎలాంటి లక్షణాలు లేవని పేర్కొన్నారు. దేశంలో ఒమైక్రాన్ వ్యాప్తి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. 

Updated Date - 2021-12-24T23:29:37+05:30 IST