37 ఏళ్ల సాధ్విపై ఆశ్రమంలో అత్యాచారం..

ABN , First Publish Date - 2020-09-09T20:57:30+05:30 IST

సభ్యసమాజం తలవంచుకునే ఘటన జార్ఖాండ్‌లోని గొడ్డా జిల్లాలో జరిగింది. ఇక్కడి ఆశ్రమంలో..

37 ఏళ్ల సాధ్విపై ఆశ్రమంలో అత్యాచారం..

రాంచీ: సభ్యసమాజం తలవంచుకునే ఘటన జార్ఖాండ్‌లోని గొడ్డా జిల్లాలో జరిగింది. ఇక్కడి ఆశ్రమంలో ఉంటున్న 36 ఏళ్ల హిందూ సన్యాసినిని (సాధ్వి) తుపాకితో బెదిరించి ఆగంతకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈనెల 7వ తేదీ రాత్రి ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది.


నలుగురు సాయుధ దుండగులు మహిళా సత్సంగ్ ఆశ్రమం ప్రహారీగోడ దూకి లోపలకు వచ్చి ఆశ్రమవాసులను వేర్వేరు గదుల్లో బందీలను చేశారు. సాధ్విని ఒక గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆశ్రమంలో ఒకరే మగవ్యక్తి ఉన్నాడు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ, సోమవారం రాత్రి నలుగురు సాయుధులు ఆశ్రమంలోకి చొరబడ్డారని, తాను ఆపేందుకు ప్రయత్నించగా తనను కొట్టి ఒక గదిలో బందించారని చెప్పారు. నలుగురు సాధ్వీలను కూడా వేర్పేరు రూముల్లో లాక్ చేశారని చెప్పారు.


కాగా, ఈ ఘటన తెలిసిన వెంటనే నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని ఎస్‌పీ వైఎస్ రమేష్ తెలిపారు. దీనిపై వేగంగా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.

Updated Date - 2020-09-09T20:57:30+05:30 IST