Advertisement
Advertisement
Abn logo
Advertisement

సూళ్లూరుపేట సబ్‌ డివిజన్‌లో 3,750 హెక్టార్లల్లో దెబ్బతిన్న వరి

సూళ్లూరుపేట, నవంబరు 30 : సూళ్లూరుపేట వ్యవసా యశాఖ సబ్‌ డివిజన్‌ పరిధిలో వర్షాలకు 3,750 హెక్టార్లల్లో వరి పైర్లు దెబ్బతిన్నట్లు అధికారులు నమోదు చేశారు. 32 హెక్టార్లల్లో నారుమళ్లు పాడైనట్లు గుర్తించారు. వ్యవసాయ శాఖ  ఏడీఏ రాజ్‌కుమార్‌ సమాచారం మేరకు, సూళ్లూరుపే ట మండలంలో 1,250 హెక్టార్లల్లో వరిపైర్లు, 10 హెక్టార్లల్లో నారుమళ్లు, దొరవారిసత్రంలో 850 హెక్టార్లల్లో వరి, 12 హెక్టార్లల్లో నారుమళ్లు, తడలో 1650 హెక్టార్లల్లో వరి, 10 హెక్టార్లల్లో నారుమళ్లు పాడైనట్లు  ప్రభుత్వానికి నివేదిక  పంపారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


 నీట మునిగిన వరి.. రైతుల్లో ఆందోళన

నాయుడుపేట టౌన్‌, నవంబరు 30 : వరదనీటితో మండలంలోని అన్ని గ్రామాల్లో  పైర్లు నీటమునిగాయి. రైతులు మొదటిదఫా వరినాట్లు వేసిన సమయంలో భారీ వర్షాలు పడటంతో పూర్తిగా దెబ్బతిన్నాయి.  మళ్లీ రెండో దఫా నాట్లు వేసిన వెంటనే భారీ వర్షాలు పడటంతో వరి పైరు పూర్తిగా దెబ్బతింది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మునిగిన పైర్లను పరిశీలించి  , సాయం చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. 

నాయుడుపేట : పుదూరులో నీటమునిగిన వరిపైరు


Advertisement
Advertisement